Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

National Highway : జాతీయ రహదారిపైనే భారీ పార్కింగ్‌.. ఎవరికి పట్టదా..!

National Highway : జాతీయ రహదారిపైనే భారీ పార్కింగ్‌.. ఎవరికి పట్టదా..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై శ్రీ వెంకటేశ్వర థియేటర్ మైత్రి ఫిల్మ్ లో సరిపడ పార్కింగ్ లేకపోవడంతో సినిమాకు వచ్చిన ప్రేక్షకుల వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. నిత్యం వాహనాల పార్కింగ్ పెరిగిపోతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రధాన రోడ్డు గుండా వాహనాలు పార్కింగ్‌ చేస్తుండటంతో పాటు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్కింగ్ తో పాదాచారులు రోడ్ల వెంట నడవడానికి జాగా కూడా ఉండడం లేదు. దీంతో పాదాచారులు రోడ్డు వెంట నడవడానికి జంకుతున్నారు.

పాదాచారులు నడిచే స్థలంలో నిత్యం వాహనాలు పార్కింగ్ చేయడంతో పాదాచారులు, పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాతీయ రహదారిపై నడవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎటు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో అని పాదాచారులు జంకుతున్నారు.

ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, ప్రేక్షకుల వాహనాలను జాతీయ రహదారి పక్కన ఉంచకుండా చర్యలు తీసుకోని, పాదాచారులకు , రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రమాదాలు సంభవించక ముందే ప్రజల ఇబ్బందులు తొలగించడానికి మున్సిపల్‌ సిబ్బంధితో పాటు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

MOST READ :

  1. Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!

  2. Nalgonda : తెలంగాణలో డ్రగ్స్ పై యుద్ధం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  3. Gold Price : మరోసారి గొప్ప కూలిన గోల్డ్.. భారీగా దిగి వచ్చిన బంగారం..!

  4. Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పోలీసులు మృతి..!

  5. Miryalaguda : పేద విద్యార్థికి ట్రిపుల్ ఐటీలో సీటు.. దాతలు సహకరిస్తేనే జాయినింగ్..!

మరిన్ని వార్తలు