Miryalaguda : పేద విద్యార్థికి ట్రిపుల్ ఐటీలో సీటు.. దాతలు సహకరిస్తేనే జాయినింగ్..!
Miryalaguda : పేద విద్యార్థికి ట్రిపుల్ ఐటీలో సీటు.. దాతలు సహకరిస్తేనే జాయినింగ్..!
మిర్యాలగూడ, మన సాక్షి:
పేద విద్యార్థికి అత్యున్నతమైన ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. ఆర్థిక పరిస్థితి సహాకరించకపోవడంతో కోర్సు పూర్తికి వెనకంజ వేస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.
మిర్యాలగూడ పట్టణానికి చెందిన కుర్ర శివ వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుండగా రెండవ కుమారుడు కుర్ర అభిరామ్ ఇంటర్ పూర్తి చేశారు. కాగా ఇటీవల విడుదలైన జాతీయ స్థాయి మెయిన్స్ పరీక్షలో అభిరామ్ 82 శాతం పర్సెంటేల్ తో కేరళ రాష్ట్రం కొట్టాయంలో ట్రిపుల్ ఐటీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీటు సాధించారు.
ఒకటి నుండి 7వ తరగతి వరకు అభ్యస్ స్కూల్ చదవగా, 8నుండి 10వరకు బకాల్వాడ ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్ లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించగా జాతీయ స్థాయి మెయిన్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచి సీటు సాధించారు. కాగా ఆర్థిక పరిస్థితి సహాకరించక కోర్సు పూర్తికి ప్రతి ఏడాది 1.70 లక్షలు ఫీజులు చెల్లించాలని పేర్కొనడంతో సతమతమౌతున్నారు.
నాలుగేళ్ల కోర్సుకు 6 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుండగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు కావడంతో ల్యాబ్ ట్యాప్ కావాల్సి వుంటుందని విద్యార్ది కుర్ర అభిరామ్ తెలిపారు. దాతలు సహకరిస్తే భవిష్యత్ లో కంప్యూటర్ ఇంజనీర్ అయి పేద తరగతి ప్రజలకు అవసరమైన సహాయసహకారాలు అందజేస్తానని చెప్పారు.సహాయం చేసే దాతలు 91 79952 59310 ఫోన్ నంబర్ కు సంప్రదించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి :
-
ICICI : యువత కోసం మార్కెట్ ఆధారిత పథకాన్ని ఆవిష్కరించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్..!
-
Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పోలీసులు మృతి..!
-
Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీభత్సం సృష్టించిన కారు..!
-
Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!









