ICICI : యువత కోసం మార్కెట్ ఆధారిత పథకాన్ని ఆవిష్కరించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్..!
ICICI : యువత కోసం మార్కెట్ ఆధారిత పథకాన్ని ఆవిష్కరించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్..!
• అందుబాటు స్థాయిలో, కనీస నెలవారీ ప్రీమియం రూ. 1,000
• తక్కువ వ్యయాలతో, పన్నుల ఆదాపరంగా సమర్ధవంతమైన విధంగా సంపద సృష్టికి మార్గం
ముంబై. మన సాక్షి:
దీర్ఘకాలంలో సంపదను పెంపొందించుకోవడంలో కస్టమర్లకు తోడ్పాటు అందించే లక్ష్యంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా ఐసీఐసీఐ ప్రు స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ పేరిట మార్కెట్ ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టింది.
నెలకు కేవలం రూ. 1,000 ప్రీమియంతో ఈ ప్రోడక్టును కొనుగోలు చేయొచ్చు. యువ కస్టమర్లు ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసేందుకు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించుకునేందుకు ఇది తోడ్పడుతుంది. లైఫ్ కవరేజీ కూడా ఉండటం వల్ల, ఏదైనా అనుకోనిది జరిగితే కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది.
“ఇటీవలే ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఒక కీలక మైలురాయిని అధిగమించింది. మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా, 2028 నాటికి 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. దేశ జనాభాలో 65 శాతం వాటా ఉన్న యువత, భారత వృద్ధి గాథకు దన్నుగా నిలవనుంది. ఈ వర్గాన్నే దృష్టిలో ఉంచుకునే మేము ఐసీఐసీఐ ప్రు స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్‌ను ఆవిష్కరించాం.
స్వరూపరీత్య యులిప్స్ అనేవి సమర్ధవంతమైన సంపద సృష్టి సాధనంగా ఉపయోగపడతాయి. చిన్న వయస్సు నుంచే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి, దీర్ఘకాలం పాటు పెట్టుబడులను కొనసాగించేలా యువతను ప్రోత్సహించే దిశగా మేము ఐసీఐసీఐ ప్రు స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్‌ను ఆవిష్కరించాం. తక్కువ వ్యయాలతో కూడుకున్న, పన్నులపరంగా సమర్ధవంతమైన ఈ పథకం, తొలిసారిగా ఉద్యోగాల్లో చేరిన వారు కావచ్చు లేదా యువత కావచ్చు చాలా తక్కువగా నెలకు రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
దీర్ఘకాలంలో సంపదను పెంపొందించుకునే క్రమంలో భారత వృద్ధి గాథలో పాలుపంచుకునేందుకు, దాన్నుంచి ప్రయోజనం పొందేందుకు యువతకు ఇది తోడ్పడుతుంది. ఈ ఉత్పత్తి యొక్క టార్గెట్ సెగ్మెంట్‌ను, బ్రాండ్స్ మరియు ప్రోడక్టులతో డిజిటల్‌గా ఎంగేజ్ కావడంలో వారి ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని మేము ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా తీర్చిదిద్దాం.
ఐసీఐసీఐ ప్రు స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లస్ అనేది కస్టమర్లు ఎంచుకునేందుకు 25 ఫండ్స్ శ్రేణిని, నాలుగు పోర్ట్‌ఫోలియో వ్యూహాలను అందిస్తుంది. అలాగే, ఎటువంటి వ్యయాలు, పన్నులపరమైన భారం ప్రభావాలు లేకుండా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కి మారడం ద్వారా కస్టమర్లు తమ అసెట్ అలొకేషన్‌ను మెరుగుపర్చుకోవచ్చు. లైఫ్ కవరేజీ రూపంలో కస్టమర్లకు ఈ పథకం ఆర్థిక భద్రతను కూడా అందిస్తుంది.
సంపద సృష్టి అనేది దీర్ఘకాలిక ప్రక్రియని, ఇందుకోసం కస్టమర్లు క్రమశిక్షణతో కూడుకున్న విధానాన్ని పాటించాల్సి ఉంటుందని మేము విశ్వసిస్తాం. తమ ఆర్థిక లక్ష్యాన్ని సాధించుకునేలా క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లింపులను ఒక పద్ధతిలో జరిపేలా కస్టమర్లను ప్రోత్సహించే విధంగా ఐసీఐసీఐ ప్రు స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ తీర్చిదిద్దబడింది. పాలసీదారు కన్నుమూసినా దీర్ఘకాలిక పొదుపు లక్ష్యం పట్టాలు తప్పకుండా చూసుకునేందుకు ప్రీమియం వెయివర్ ఆప్షన్‌ను యాడ్-ఆన్ బెనిఫిట్‌గా ఎంచుకోవచ్చు.
మారుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చే పథకాలను రూపొందించడంపై మేము మరింతగా దృష్టి పెడుతున్నామనడానికి ఈ పథకం ఆవిష్కరణే నిదర్శనంగా నిలుస్తుంది. కస్టమర్లు తమ వెసులుబాటును బట్టి స్పష్టతతో, నిశ్చింతగా తమ భవిష్యత్తు కోసం తమ పంథాను బట్టి ప్లాన్ చేసుకునేందుకు ఇదొక తక్కువ వ్యయాలతో కూడుకున్న సాధనంగా ఉపయోగపడగలదు” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రోడక్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ Mr. అమిత్ పల్టా తెలిపారు.
ఇవి కూడా చదవండి :









