Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జాతీయం

Business: ఈక్వల్‌కు WEF 2025 టెక్నాలజీ పయనీర్స్ జాబితాలో చోటు..!

Business: ఈక్వల్‌కు WEF 2025 టెక్నాలజీ పయనీర్స్ జాబితాలో చోటు..!

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేల కొద్దీ దరఖాస్తుల నుంచి గ్లోబల్ 100 ఇన్నోవేటర్ల జాబితాలోకి ఎంపికైన జీవీకే కేశవ్ రెడ్డి స్థాపిత స్టార్టప్; భారత్ నుంచి ఎంపికైన 10 స్టార్టప్‌లలో ఒకటిగా ఘనత

నేషనల్: భారతదేశపు అగ్రగామి సెక్యూర్ డేటా షేరింగ్ ప్లాట్‌ఫాంలలో ఒకటైన ఈక్వల్ సంస్థ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) 2025 టెక్నాలజీ పయొనీర్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇది వివిధ పరిశ్రమలవ్యాప్తంగా పరివర్తనకు దోహదపడుతున్న 100 గ్లోబల్ కంపెనీల జాబితా. ప్రపంచవ్యాప్తంగా వేల కొద్దీ దరఖాస్తులు రాగా 100 కంపెనీలను WEF ఈ జాబితా కోసం ఎంపిక చేసింది. వాటిలో ఈక్వల్ కూడా ఒకటి. అలాగే భారత్ నుంచి కేవలం 10 సంస్థలు ఎంపిక కాగా వాటిలో కూడా ఒకటిగా సంస్థ నిల్చింది. దీనితో గతంలో WEF పయోనీర్లుగా నిల్చిన గూగుల్, స్పాటిఫై, ఎయిర్‌బీఎన్‌బీ లాంటి దిగ్గజ సంస్థల సరసన ఈక్వల్ కూడా చోటు దక్కించుకుంది. ఈక్వల్‌ను 2022లో కేశవ్ రెడ్డి మరియు రాజీవ్ రంజన్ స్థాపించారు.

కంపెనీ ప్రధానంగా కేవైసీ, మోసాల నివారణ అలాగే లెండింగ్, బీమా, ఎంప్లాయ్‌మెంట్ తదితర విభాగాలవ్యాప్తంగా ఆర్థిక డేటా షేరింగ్‌ కోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలను అందిస్తోంది. ఆర్‌బీఐ లైసెన్సు గల భారతదేశపు అతి పెద్ద అకౌంట్ అగ్రిగేటర్ అయిన వన్‌మనీలో ఈక్వల్‌కు వ్యూహాత్మక వాటా ఉంది.

2025 మార్చిలో ఈక్వల్ 10.1 కోట్ల పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం ఏటా 100 కోట్ల లావాదేవీల రన్ రేట్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమాణం 75,000గా నమోదైంది. భారత్‌లోని కొన్ని దిగ్గజ ఆర్థిక సంస్థలతో పాటు 250 పైచిలుకు క్లయింట్లకు కంపెనీ సేవలు అందిస్తోంది. 50 పైగా ఐడీ రిపాజిటరీలతో కనెక్ట్ అయి ఉంది. 97% కేవైసీ సక్సెస్ రేటుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

“వరల్డ్ ఎకనమిక్ ఫోరం గుర్తింపు లభించడం మాకెంతో సంతోషకరమైన విషయం. భారతదేశపు డిజిటల్ భవిష్యత్తుకు సమ్మతి ఆధారితమైన, సురక్షితమైన డేటా షేరింగ్ అనేది పునాదిరాయిగా ఉంటుందన్న మా నమ్మకాన్ని ఇది పునరుద్ఘాటిస్తుంది. ఓ గిగ్ వర్కర్‌ తొలిసారిగా రుణ సదుపాయం పొందడంలో సహాయకరంగా నిలవడం నుంచి అత్యవసరంలో ఉన్న కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల ప్రక్రియను వేగవంతం చేయడంలో తోడ్పడటం వరకు, ధృవీకరించబడిన డేటా అందుబాటులో ఉండటమనేది ఎంత అర్థవంతంగా జీవితాలను మార్చగలదనేది గత ఏడాది కాలంగా మేము చూశాం.

రాబోయే రోజుల్లో వ్యక్తిగత డేటా అనేది ప్రతి భారతీయుడికి ప్రయోజనం కలిగించేలా, బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, విస్తృతంగా ఉపయోగపడేందుకు తోడ్పడే పటిష్టమైన, ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాల కల్పనపై మేము మరింతగా దృష్టి పెడుతున్నాం” అని ఈక్వల్ వ్యవస్థాపకుడు కేశవ్ రెడ్డి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి : 

  1. TG News : బోనాల పండుగ వేళ.. ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్..!

  2. Fact Check : ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..!

  3. Nalgonda : తెలంగాణలో డ్రగ్స్ పై యుద్ధం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  4. Star Health: మెడి అసిస్ట్‌తో జట్టు కట్టిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్..!

మరిన్ని వార్తలు