Gold Paste : రూ. 2కోట్ల గోల్డ్ పేస్ట్.. యువ జంట అరెస్ట్..!
జాతీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం కు రోజురోజుకు ధర పెరుగుతున్న కొద్దీ క్రేజ్ కూడా పెరుగుతుంది.

Gold Paste : రూ. 2కోట్ల గోల్డ్ పేస్ట్.. యువ జంట అరెస్ట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
జాతీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం కు రోజురోజుకు ధర పెరుగుతున్న కొద్దీ క్రేజ్ కూడా పెరుగుతుంది. బంగారం ఎలాగైనా తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువ జంటను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
విచిత్రంగా ఈ జంట బంగారాన్ని పేస్టు రూపంలో చేసి ప్యాంటు నడుము పట్టిలలో దాచి తరలిస్తుండగా ఈ జంటను అరెస్ట్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. నిందితులను తమిళనాడులోని పుదుకొట్టయి జిల్లాకు చెందిన రిఫ్నాస్ హమీద్ మహమ్మద్ షరీఫ్ (26) అతని భార్య ఉమర్ ఫరూక్ (23) గా గుర్తించారు.
వీరు ఈనెల 13వ తేదీన అబుదాబి నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో విమానాశ్రయానికి వచ్చారు. కాగా వారి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. ఈ జంటను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాంతో అసలు విషయం బయటపడింది. నడుము బెల్టులో దాచిన బంగారం పేస్టును వెలికి తీశారు. సుమారు దాని విలువ 1.94 కోట్ల రూపాయలు ఉంటుంది. 1353 గ్రాముల 24 క్యారెట్ బంగారాన్ని పేస్టు రూపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు.









