Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESజాతీయం

Star Health: మెడి అసిస్ట్‌తో జట్టు కట్టిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్..!

Star Health: మెడి అసిస్ట్‌తో జట్టు కట్టిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్..!

చెన్నై, మనసాక్షి :

భారతదేశపు దిగ్గజ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్) కొత్తగా మెడి అసిస్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. అధునాతన ఏఐ ఆధారిత క్లెయిమ్స్ ప్లాట్‌ఫాం మేట్రిక్స్‌ను (MAtrix) వినియోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది.

సెటిల్మెంట్లను వేగవంతం చేయడం, కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించడం, టెక్నాలజీ ఆధారంగా సర్వీసులను మెరుగుపర్చుకోవడం దిశగా స్టార్ హెల్త్ కొనసాగిస్తున్న క్లెయిమ్స్ పరివర్తన ప్రస్థానంలో ఈ భాగస్వామ్యం కీలక ముందడుగు కానుంది. ఏఐ సాధనాల ద్వారా మోసాలను గుర్తించి, అరికట్టడం, వృధా, దుర్వినియోగాన్ని తగ్గించడం మొదలైన వాటికి ఇది తోడ్పడుతుంది.

భవిష్యత్ అవసరాల కోసం తమ క్లెయిమ్స్ వ్యవస్థను ఆధునీకరించి, సర్వసన్నద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుకోవడంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉంటుంది. కార్యకలాపాల్లో వేగం, స్థిరత్వం, పారదర్శకత్వాన్ని కొనసాగిస్తూనే పెరుగుతున్న క్లెయిమ్‌లను సమర్ధవంతంగా పరిష్కరించే సామర్థ్యాలను పటిష్టం చేసుకునేందుకు కంపెనీకి ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది.

ఈ పరివర్తనలో భాగంగా ఆసుపత్రులు, పాలసీదారులు, రెగ్యులేటర్ల నుంచి సర్వీసులపరంగా పెరుగుతున్న అంచనాలను అందుకునేలా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తమ డిజిటల్ సామర్థ్యాలను పటిష్టం చేసుకోనుంది. ఈ ప్లాట్‌ఫాం అనేది ఇంటెలిజెంట్ ఆటోమేషన్‌ను పరిచయం చేస్తుంది. మాన్యువల్‌ దశలను తగ్గించి, వర్క్‌ఫ్లోను క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా నెట్‌వర్క్‌వ్యాప్తంగా టర్నెరౌండ్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.

“మా కంపెనీలో అంతర్గతంగా క్లెయిమ్ నిర్వహణ సామర్థ్యాలను పటిష్టం చేసుకునే దిశగా ఇదొక కీలక ముందడుగు. మరింత మెరుగైన, టెక్నాలజీ ఆధారితమైన క్లెయిమ్స్ వ్యవస్థను నిర్మించే క్రమంలో ఈ భాగస్వామ్యం ముఖ్యమైన మైలురాయిలాంటిది. మెరుగైన బీమా అనుభూతిని అందించేందుకు క్లెయిమ్స్ ఎంతో కీలకం.

మెడి అసిస్ట్ ప్లాట్‌ఫాం ద్వారా ఒకవైపు మోసాలు, వ్యర్థాలు, దుర్వినియోగంపై కన్ను పెడుతూనే మరోవైపు క్లెయిమ్స్ ప్రక్రియ మరింత వేగవంతంగా, కచ్చితత్వంతో, నిలకడగా ఉండేలా మేము మెరుగుపర్చుకుంటున్నాం. మానవప్రమేయం తగ్గించడం, ప్రక్రియలను ప్రామాణికం చేయడం ద్వారా మా సామర్థ్యాలను పటిష్టం చేసుకోవాలని, పాలసీదారుల్లో విశ్వసనీయతను పెంపొందించుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఆరోగ్య బీమా రంగం, అలాగే ఆరోగ్య సంరక్షణకు సంబంధించి మారుతున్న అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా, నమ్మకంగా, కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే క్లెయిమ్స్ సర్వీసులను అందించడంపై మరింతగా దృష్టి పెట్టేందుకు ఈ భాగస్వామ్యంతో పాటు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చేపడుతున్న ఇతరత్రా కార్యక్రమాలన్నీ దోహదపడగలవు” అని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు.

“ఈ పరివర్తనాత్మక ప్రస్థానంలో భాగస్వాములం కావడం మాకు సంతోషకరమైన విషయం. టెక్నాలజీ ఆధారంగా బీమా కార్యకలాపాలను నిర్వహించడం, పాలసీదారులకు అసాధారణమైన అనుభూతిని అందించడంలో ఈ భాగస్వామ్యం, యావత్ పరిశ్రమలోనే కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది” అని మెడి అసిస్ట్ సీఈవో సతీష్ గిడుగు తెలిపారు.

క్లెయిమ్స్ పరిష్కారంలో నిర్దుష్ట ప్రామాణిక నిబంధనలను నిలకడగా పాటించడంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. వ్యక్తిగత ఉద్దేశాలకు తావు లేకుండా, కచ్చితత్వంతో, సముచితంగా క్లెయిమ్స్ ప్రక్రియను తీర్చిదిద్దేందుకు తోడ్పడుతుంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క క్లెయిమ్స్ టీమ్‌లు మరింత వేగవంతంగా, పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడేలా ఈ ప్లాట్‌ఫాంలోని కో-వర్కింగ్, ఏఐ కో-పైలట్ సపోర్ట్ తోడ్పడతాయి.

అలాగే, అధునాతన ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ టూల్స్ అనేవి మోసాలను గుర్తించడం, నివారించడంలో కంపెనీ తన సామర్థ్యాలను పటిష్టపర్చుకునేందుకు, వృధాను తగ్గించేందుకు, క్లెయిమ్స్ ప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు దోహదపడతాయి.

ఏఐ ఆధారిత చాట్‌బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు, మొబైల్ యాప్‌లు, వాట్సాప్ వంటి వివిధ మాధ్యమాలవ్యాప్తంగా సపోర్ట్‌ అందుబాటులో ఉండటం వల్ల కస్టమర్లతో కంపెనీ తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఏకీకృత ఏపీఐ ఆర్కిటెక్చర్ అనేది బీమా సంస్థలు, హెల్త్‌కేర్ ప్రొవైడర్లు మరియు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ (ఎన్‌హెచ్‌సీఎక్స్) డేటాను సురక్షితంగా, రియల్ టైమ్‌లో ఎక్స్చేంజ్ చేసుకునేందుకు, తద్వారా సంబంధిత వర్గాలన్నింటి మధ్య కనెక్టివిటీ మెరుగుపడేందుకు సహాయకరంగా ఉంటుంది.

కొత్త ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సన్నద్ధత మరియు పాలసీదారుల ప్రయోజనాలపై మరింత దృష్టి పెట్టడం వంటి అంశాల మేళవింపుతో భారతదేశపు డిజిటల్ ఆరోగ్య బీమా రంగంలో ఈ భాగస్వామ్యం ఒక కీలక పురోగతిగా నిలుస్తుంది.

MOST READ ; 

  1. TG News : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. అప్పటి లోగా నిర్వహించాలని ఆదేశాలు..!

  2. Youth: అప్పు చేసి పప్పు కూడు కు స్వస్తి.. వ్యక్తిగత రుణాలపై ఆసక్తి తగ్గుదల..!

  3. Students : ఇంటర్ చదివే విద్యార్థులు.. లక్షల రూపాయలు వారికి ఎక్కడివి.. కట్ చేస్తే పోలీసుల అదుపులో..!

  4. Transfers : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!

  5. Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి రేషన్ కట్..!

మరిన్ని వార్తలు