Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంరాజకీయం

TG News : బోనాల పండుగ వేళ.. ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్..!

TG News : బోనాల పండుగ వేళ.. ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో గురువారం నుంచి ఆషాడ మాసం బోనాల పండగ ప్రారంభమైంది. పండగ ప్రారంభమైన మొదటి రోజే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. పెండింగ్ లో ఉన్న రూ.180 కోట్ల మెడికల్ బకాయిలను క్లియర్ చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. దానివల్ల రాష్ట్రవ్యాప్తంగా 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట కలిగిందని ఆయన తెలిపారు.

గత ప్రభుత్వం నాటి పెండింగ్ బిల్లులను ప్రస్తుతం క్లియర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా.. భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను ప్రాధాన్యత ఇచ్చి బకాయిలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

క్లిక్ చేసి ఈ వార్తలు కూడా చదవండి : 

  1. Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)

  2. Nalgonda : తెలంగాణలో డ్రగ్స్ పై యుద్ధం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  3. Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. TG News : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. అప్పటి లోగా నిర్వహించాలని ఆదేశాలు..!

మరిన్ని వార్తలు