Bank Holidays : జూలైలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు.. లిస్ట్ ఇదే..!

Bank Holidays : జూలైలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు.. లిస్ట్ ఇదే..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
జూలై 2025 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలోని వివిధ బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు రానున్నాయి. సెలవుల్లో కొన్ని జాతీయ సెలవులు కాగా మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు కార్యకలాపాలు నిర్వహించుకోవలసి ఉంది.
సెలవుల జాబితా ఇదే..!
జులై 3 ( గురువారం) కరాచీ పూజ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు.
జూలై 6 (ఆదివారం) బ్యాంకు సెలవు
జూలై 5 (శనివారం) గురు హర్ గోవింద్ జన్మదినం సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లోని బ్యాంకులకు సెలవు
జూలై 12 (శనివారం) రెండవ శనివారం
జూలై 13 (ఆదివారం) బ్యాంకులకు సెలవు
జూలై 14 (సోమవారం) బెంజీన్ ఖ్లామ్ పండుగ మేఘాలయలోని బ్యాంకులకు సెలవు
జూలై 16 (బుధవారం) హరేలా పండుగ సందర్భంగా ఉత్తరాఖండ్ లోని బ్యాంకులకు సెలవు
జూలై 17 (గురువారం) యు రైట్ అప్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు
జూలై 19 (శనివారం) కేర్ పూజ సందర్భంగా త్రిపుర లో బ్యాంకులకు సెలవు
జూలై 20 (ఆదివారం) బ్యాంకులకు సెలవు
జూలై 26 (శనివారం) నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు
జూలై 27 (ఆదివారం) బ్యాంకులకు సెలవు
జూలై 28 (సోమవారం) డ్రూక్పా టెషీ పండుగ సందర్భంగా సిక్కిం లోని బ్యాంకులకు సెలవు
అయితే బ్యాంకులకు సెలవు దినం సందర్భంగా కార్యకలాపాలు కొనసాగవు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెలవులు కూడా యధావిధిగా కొనసాగుతాయి. ఏటీఎం, యూపీఎస్ సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి కాబట్టి బ్యాంకులకు వెళ్లకుండా సెలవు రోజుల్లో మీ ఆర్దిక కార్యకలాపాలు చక్కబెట్టుకోవచ్చును.
MOST READ :
-
Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. ఎప్పటిలోగా నిండుతుందంటే..!
-
Gold Price : దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..!
-
District collector : అర్బన్ హెల్త్ సెంటర్ లో ఐదుగురు స్టాఫ్ గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!
-
District collector : జిల్లా కలెక్టర్ రైతులకు భారీ శుభవార్త.. అందుబాటులోకి ధాన్యం తడిసినా.. ఆరబెట్టే యంత్రం..!
-
Annadata Sukhibhava : రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!









