Gold Price : దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..!
Gold Price : దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. తులం బంగారం లక్ష రూపాయలకు పైగా ఆయన విషయం తెలిసిందే. కానీ వరుసగా మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి.
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు శనివారం ఒక రోజే 6000 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో శనివారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 6000 రూపాయలు తగ్గి 9, 74,200 రూపాయలు గా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం కు 100 గ్రాములకు 5500 రూపాయలు తగ్గి 8, 93,000 రూపాయలుగా ఉంది
ఈరోజు తులం ఎంతంటే..!
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం శనివారం (28/06/2025) 24 క్యారెట్స్ కు 97,420 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ కు 10 గ్రాముల (తులం) బంగారం కు 89,300 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, నల్లగొండ, వరంగల్ తోపాటు వివిధ పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.
Similar News :









