Mahindra : అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ప్రవేశపెడుతున్న మహీంద్రా..!

Mahindra : అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ప్రవేశపెడుతున్న మహీంద్రా..!
ముంబై, మన సాక్షి:
భారతదేశపు దిగ్గజ ఎస్‌యూవీ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ స్కార్పియో-ఎన్‌లో కొత్తగా లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌ని (ADAS) ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దీనితో పాటు ప్రీమియం Z8 శ్రేణిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా కొత్త Z8T వేరియంట్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. స్కార్పియో-ఎన్ మూడేళ్ల వ్యవధిలో 2.5 లక్షల మంది కస్టమర్ల మైలురాయిని అందుకుంది.
లెవెల్ 2 ఏడీఏఎస్‌తో మరింత మెరుగైన భద్రత, టెక్నాలజీ ప్రమాణాలు : ప్రీమియం Z8L వేరియంట్‌లోని లెవెల్ 2 ఏడీఏఎస్
ప్రత్యేకతలు:
• ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్
• ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
• స్టాప్ అండ్ గో ఫీచరుతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
• స్మార్ట్ పైలట్ అసిస్ట్
• లేన్ డిపార్చర్ హెచ్చరిక
• లేన్ కీప్ అసిస్ట్
• ట్రాఫిక్ సంకేతాల గుర్తింపు
• హై బీమ్ అసిస్ట్
స్కార్పియో-ఎన్ ఏడీఏఎస్‌లో స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ లాంటి ప్రత్యేక ఫీచర్లు కూడా ఉంటాయి. మహీంద్రా ఐసీఈ ఎస్‌యూవీల్లో ఇవి లభించడం తొలిసారి. స్పీడ్ లిమిట్ అసిస్ట్ అనేది నిర్దిష్ట రహదారుల్లో వర్తించే స్పీడ్ లిమిట్స్ విషయంలో డ్రైవర్లను అలర్ట్ చేస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మోడ్ అనేది సునాయాసంగా, సింగిల్ బటన్ ఆపరేషన్ ద్వారా స్పీడ్ లిమిట్స్‌కి అనుగుణంగా వెళ్లే వేగాన్ని నియంత్రించుకునేందుకు వీలవుతుంది. ఫ్రంట్ వెహికల్ స్టార్ అలర్ట్ అనేది, ముందు నిలబడిన వాహనం కదలడం మొదలైనప్పుడు అలర్ట్ చేస్తుంది.
Z8T వేరియంట్ – శక్తివంతమైన సరికొత్త వాహనం
Z8 మరియు Z8Lకి మధ్య ఉండే ఈ సరికొత్త Z8T వేరియంట్ అనేది స్కార్పియో-ఎన్‌కి చెందిన ప్రీమియం Z8 శ్రేణిని మరింత పటిష్టం చేస్తుంది. R18 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, 12-స్పీకర్ సోనీ బ్రాండెడ్ ఆడియో సిస్టం, ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఈపీబీ), ముందు సీట్లకు చక్కని వెంటిలేషన్, ఆటో-డిమ్మింగ్ IRVM తదితర ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పనితీరు, సౌకర్యం, స్టయిల్ అంశాల్లో రాజీపడకుండా ఇది డబ్బుకు తగ్గ విలువను చేకూరుస్తుంది.









