Cotton : పత్తి సాగులో మెలకువలు పాటించాలి.. పత్తి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి..!
Cotton : పత్తి సాగులో మెలకువలు పాటించాలి.. పత్తి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి..!
కేతేపల్లి, మనసాక్షి:
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని తుంగతుర్తి గ్రామంలో ప్రస్తుతం వానాకాలం సాగుచేస్తున్న పత్తి పొలాలను మండల వ్యవసాయ అధికారి బి.పురుషోత్తం సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు.
ప్రస్తుతం పత్తి పంట విత్తనాలు వేసి 20-30 రోజుల దశలో ఉన్నందున, పత్తి పంటలో గడ్డి, వెడల్పటి ఆకులు గల కలుపును గుర్తించటం జరిగిందని, కలుపు నివారణకు అంతర కృషి చేయటానికి అనుకూలంగా ఉన్నదని, అలా కానీ స్థితిలో ఎకరానికి క్విజాలోఫోస్ -ఇ -ఇథైల్ 400ml, 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని, వెడల్పటి ఆకు సమస్య అధికంగా ఉన్నాయెడల ఎకరాకు పైరితాయో బ్యాక్ సోడియం 250ml ను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.
అదేవిధంగా రైతు సోదరులు సిఫారసు చేసిన నత్రజని మరియు పోటాష్ ఎరువులు నాలుగు సమ భాగాలుగా చేసి విత్తిన 20,40,60,80 రోజులకు వేయాలని ఆయన రైతులకు వివరించారు. ఈ క్షేత్ర పర్యటనలో మండల వ్యవసాయ అధికారి బి. పురుషోత్తం, రైతులు వెంకన్న, శోభన్ పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..
-
TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. వారికి 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా..!
-
TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!









