Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
ORR : ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి..!

ORR : ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి..!
హైదరాబాద్, మన సాక్షి :
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై బొంగులూరు ఎగ్జిట్ పిల్లర్ నెంబర్ 108 వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అంబర్పేట్ నుండి బొంగులూరు ఎగ్జిట్ వైపుకు వెళుతున్న రెడ్ కలర్ బలెనో కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు.
పెద్ద అంబర్పేట్ నుండి బొంగులూరు ఎగ్జిట్ దగ్గర 108 పిల్లర్ వద్దకు రాగానే వెనుక వైపు నుండి ఒక లారీ కారును ఢీ కొట్టింది. దాంతో కారు పూర్తిగా దెబ్బతిన్నది. సంఘటన స్థలంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో నీలాద్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు కారులో చిక్కుకోవడంతో పోలీసులు వారిని బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. అలాంటి వారి జీతాన్ని నిలిపివేస్తా..!
-
District collector : అక్రమ కట్టడాలపై జిల్లా కలెక్టర్ సీరియస్.. నోటీసులు జారీ చేయాలని ఆదేశం..!
-
IPO: కాగితం, నెట్వర్కింగ్ రంగాల్లో ఐపీవోల జోరు.. సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన సిల్వర్టన్, ఓరియంట్ కేబుల్స్..!
-
Obesity: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిజమిదే తెలుసుకుందాం..!
-
Neck: మెడ నల్లగా మారిందా.. ఇలా చేయండి ఈజీగా పోద్ది..!









