TOP STORIESBreaking Newsతెలంగాణ

Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల ప్రక్రియ పై దృష్టి సారించింది. ప్రజాపాలన, గ్రామసభలతో పాటు మీ సేవ కేంద్రాలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అధికారులు సర్వే నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పూర్తి చేశారు. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి సభలో ప్రారంభించారు.

ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో, మండల కేంద్రాలలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జులై 25 వ తేదీ నుంచి నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జూలై 25 వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

కాగా కొత్త రేషన్ కార్డులు తీసుకునే వారికి ప్రభుత్వం వెంటనే బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా తీసుకుని తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులుగా నిర్ణయించింది. ముఖ్యంగా 500 రూపాయలకు వంట గ్యాస్ పథకాన్ని అమలు చేయడంతో పాటు గృహలక్ష్మి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేయనున్నది. రేషన్ కార్డులు పొందిన వెంటనే వీరు సంబంధించిన మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాలలో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. దాంతో వెంటనే ఆ సంక్షేమ పథకాలు తెల్ల రేషన్ కార్డులు పొందిన కొత్త వారికి కూడా వర్తించనున్నాయి.

నిరంతర ప్రక్రియ :

రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నది. ప్రస్తుతం రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికి కార్డులు మంజూరు కాలేదు. మళ్ళీ వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు. మరోసారి అర్హతలను పరిశీలించి సర్వే నిర్వహించిన అనంతరం వారికి కూడా అర్హులు అయితే కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేయనున్నది.

MOST READ : 

  1. Miryalaguda : కొత్తగా 15 వేల రేషన్ కార్డులు.. రాని వారికి మళ్లీ ధరఖాస్తుకు అవకాశం..!

  2. Hyderabad : శంషాబాద్ లో దారుణం.. పదేళ్ల చిన్నారి పై అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితుడు..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్..!

  4. TG News : జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. సామాన్యులకు ఊరుట..!

  5. Gold Price : గోల్డ్ రేట్ మళ్లీ హైక్.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు