Heavy Rain : నీట మునిగిన పంట చేలు. ఆందోళనలో రైతులు..!

Heavy Rain : నీట మునిగిన పంట చేలు. ఆందోళనలో రైతులు..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని వారం రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. తేమ అధికం కావడంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా పంటలను రక్షించుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాప్టా కే గ్రామ శివారులో పంటలలో నిల్వన నీటిని ఏఈవో హన్మండ్లు రైతులతో కలిసి పరిశీలించారు.
రాసోల్ రోడ్దు తాత్కాలికంగా మూసివేత
కంగ్రి మండలం పరిధిలోని రాసోల్, ముర్కుంజాల్ గ్రామాల మధ్య వాగు వరద ఉద్ధృతి కారణంగా సోమవారం ఉదయం ఎస్‌ఐ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో తాత్కాలికంగా రోడ్డును మూసివేశారు. ఆయన మాట్లాడుతూ… అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప దూరప్రాంతాలకు ప్రయాణం చేయోద్దన్నారు.
కంగ్టి లో అత్యధిక వర్షపాతం నమోదు
జిల్లాలో అత్యధికంగా కంగ్టి మండలంలో 1.69 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. నిజాంపేట1.30, కత్తర్1.19, సిర్గాపూర్1.07, ఆందోలు1.03 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో భారి వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
MOST READ :









