Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!

TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మనసాక్షి :

అమాయకులను, రిటైర్డ్ ఉద్యోగులను
ఎంచుకొని ఒకరికి తెలవకుండా ఒకరితో సత్సంబంధాలు ఏర్పరుచుకొని వారి నుండి భారీగా డబ్బులు దండుకుని ఓ దంపతులు భారీ మోసానికి పాల్పడ్డారు. శనివారం మల్కాజిగిరిలో విలేకరుల సమావేశం లో మోసపోయిన బాధితులు జగన్నాథరావు, రవి, శ్రీధర్, సతీష్, సుధాకర్, ఫణి, సూర్యనారాయణ మాట్లాడుతూ అమాయకులను,
రిటైర్డ్ ఉద్యోగులను వారు ఎంచుకొని ఒకరికి తెలవకుండా ఒకరితో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారని తెలిపారు.

వారితో మంచిగా నటించి అప్పుగా డబ్బులు తీసుకొని, షూరిటీగా చెక్కులను ఇచ్చి, ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రతి నెల ఒకరోజు అటూ ఇటూ కాకుండా మిత్తి డబ్బులు అందించేవారు. ఇలా 165 మంది బాధితుల నుండి దాదాపు 20 కోట్లు.రూ. వసూలు చేసి ఐపి అనగా (ఇన్సాల్వెన్సీ పిటిషన్) ను మే 30 రోజున వాట్సాప్ లో పంపించారని బాధితులు వాపోయారు. కోర్టు నుంచి నోటీసులు వాట్సాప్ లో పంపించడం ఏంటని, ఈ విచిత్ర సంఘటన చూసి బాధితులు లబోదిబో మొత్తుకున్నారు.

డబ్బులు ఇచ్చినప్పుడు అతని భార్య కూడా అందుబాటులో ఉన్నది. ఐపీ పెట్టిన రెండు రోజులకే అతని భార్య తన భర్త తో ఎలాంటి సంబంధం లేదని, విడాకులు తీసుకుంటున్నానని పేపర్ నోటీస్ ఇచ్చారు. మోసపోయిన వారు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఇది సివిల్ మ్యాటర్ అని కుషాయిగూడ పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పారు. మాకు న్యాయం చేకూర్చే విధంగా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు పేర్కొన్నారు.

MOST READ : 

  1. TG News : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం అలా పంపిణీ..!

  2. Big Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్..!

  3. Thirumala : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు 18న విడుదల.. వివరాలు ఇవీ.. బుకింగ్ ఇలా..!

  4. Doctorate : రైతు బిడ్డకు డాక్టరేట్..!

మరిన్ని వార్తలు