District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుండి లంచం డిమాండ్ చేసినందుకుగాను సూర్యపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ గ్రేడ్- 4 గ్రామపంచాయతీ కార్యదర్శి ఇ. వెంకయ్యను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేస్తూ జాన్ పహాడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఇ. వెంకయ్య గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి లంచం డిమాండ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని , రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుల నుండి లంచం డిమాండ్ చేసి విధులపట్ల నిర్లక్ష్యం వహించినందుకుగాను, జాన్ పహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇ. వెంకయ్యను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
క్రమశిక్షణ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు వెంకయ్య సస్పెన్షన్ లో కొనసాగుతారని, సస్పెన్షన్ సమయంలో ఎట్టి పరిస్థితులలో జాన్ పహాడ్ ను వదిలి వెళ్ళకూడదని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
కాగా జాన్ పహాడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఇ. అంజయ్య మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి లంచం డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి రాగా, ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి ద్వారా సమగ్ర విచారణ కు కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరు డబ్బులు డిమాండ్ చేసినా, లంచం తీసుకున్నా, నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అలాంటి వారిని విధుల నుండి సస్పెండ్ చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
MOST READ :
-
Doctorate : ఆరెగూడం వాసికి ఓయు డాక్టరేట్.. గ్రామస్తులు హర్షం..!
-
Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!
-
Open University : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్.. ధరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడంటే..!
-
Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!
-
TG News : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం అలా పంపిణీ..!









