Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!
Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!
మనసాక్షి, వెబ్ డెస్క్ :
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది. ఆయన గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 1946లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం లో జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. అయన 1969 లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. 1993 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు.
అనంతరం 2005లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ పొందారు. అనంతరం 2013 మార్చిలో మొదటి గోవా లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2013లో అక్టోబర్లోనే వ్యక్తిగత కారణాల వల్ల లోకాయుక్త పదవికి రాజీనామా చేశారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
సెప్టెంబర్ మొదటి వారంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పోటీలో ఉంటున్నట్లు బిజెపి తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా ఇండియా కూటమి సైతం పోటీలో సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కాగా ఎన్డీఏ కూటమికి సరిపడా ఎలక్టోరల్స్ ఉన్నందున సిపి రాధాకృష్ణన్ గెలుపొందుతారనే చర్చ కొనసాగుతోంది.
MOST READ :
-
District collector : నానో యూరియా తో అధిక దిగుబడి.. రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Karimnagar : లీజు రద్దు చేయాలి.. దేవాలయ భూములను కాకాపాడాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..!
-
Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!
-
NH 65 : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కిటకిట.. కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ..!








