Job Mela : నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.. జాబ్ మేళా ఎప్పుడంటే..!

Job Mela : నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.. జాబ్ మేళా ఎప్పుడంటే..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి,
జిల్లాలోని నిరుద్యోగ యువకులకు హైదరాబాద్ లోని మెడ్ ప్లస్ లో ఉద్యోగాలు కల్పించుటకు ఆగస్టు 22న మంగళవారం రోజున సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రూమ్ నెంబర్ 225 నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు.
మెడ్ ప్లస్ సంస్థలో 120 పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని, 40 ఫార్మసిస్ట్, 20 కష్టం సేల్స్ అసోసియేట్, 30 స్టాక్ పిక్కింగ్ & ప్యాకింగ్ అసిస్టెంట్, 30 ఆడిట్ అసిస్టెంట్ పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయని, ఫార్మసిస్ట్ పోస్టులకు డిప్లోమా/ డిగ్రీ ఇన్ ఫార్మసీ, కస్టమర్ సేల్స్ అసోసియేట్, ఆడిట్ అసిస్టెంట్లకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని, వీరి వయస్సు 18 నుంచి 30 లోపు ఉండాలని తెలిపారు.
ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22 న ఉదయం 11 గంటల సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో సమీకృత జిల్లా కలెక్టరేట్ కు వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9392310323, 8985336947, 8121262441 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఆ ప్రకటనలో తెలిపారు.
MOST READ NEWS :
-
Kodada : కోదాడ క్లస్టర్ ఉద్యాన విస్తరణ అధికారిగా ముత్యంరాజు.. ఎవరో తెలుసా..!
-
MLC Addanki : డాక్టరేట్ అందుకున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్..!
-
Open University : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్.. ధరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడంటే..!
-
TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!









