Nano Urea : నానో యూరియా పిచికారి ఎలా.. రైతులకు అవగాహణ..!

Nano Urea : నానో యూరియా పిచికారి ఎలా.. రైతులకు అవగాహణ..!
తుర్కపల్లి, మన సాక్షి ;
రైతులు నానో యూరియా ఎక్కువగా వాడేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నానో యూరియాతో అధిక దిగుబడి కూడా వస్తుందని విరివిగా ప్రచారం చేస్తున్నారు.
తుర్కపల్లి మండలం దత్తాయపల్లి రైతు వేదిక లో గొల్లగూడెం, పల్లె పహాడ్ గ్రామాల్లో నానో యూరియా పై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ లు మాట్లాడుతూ నానో యూరియా 500 ml ఒక ఎకరాకు పై బాటుగా వేసుకోవాలని తెలిపారు.
నానో యూరియా వాడకం ద్వారా రసాయన ఎరువులు వాడడం తగ్గించి రైతులకు ఆదాయం పెంచుతుందని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని,అధిక దిగుబడి పొందుటకు తోడ్పడుతుందని అన్నారు. నానో యూరియాలతో నిల్వ ,రవాణా చేయటం కూడా సులభం అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు జెస్సి ,తిరుమలరావు, దివ్య, రాకేష్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, రైతులు శ్రీనివాస్ రెడ్డి, భగవంత్ ,ఇస్తారి, ఎరుకల స్వామి, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!
-
District collector : నానో యూరియా తో అధిక దిగుబడి.. రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!
-
Robot : అచ్చం అమ్మాయిలా ఆకట్టుకున్న రోబో.. ప్రసంగించిన తీరుకు విద్యార్థినుల ఫిదా..!









