TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

School Building : నిధులు లేవు.. గదులు లేవు.. చదువులు సాగేదెలా..!

School Building : నిధులు లేవు.. గదులు లేవు.. చదువులు సాగేదెలా..!

కంగ్టి, మనసాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో అదనపు గదులు లేక 443 మంది విద్యార్థులు ఉన్న సరిపోను గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలోనే పనులు పూర్తి చేసినా.. ఆ పనులకు నేటికీ బిల్లులు అందక.. మిగిలిన పనులు పూర్తికాకపోవడంతో.. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నర సంవత్సరాలు గడిచి పోయినా.. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులపై దృష్టి సారించకపోవడం విడ్డూరం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నాటి మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి ప్రత్యేక కృషితో రూ. కోటి 5లక్షలతో పాఠశాల భవనం కోసం నిధులు మంజూరయ్యాయి.

మన ఊరు – మనబడి పనులు భాగంగా స్లాబ్ వేసి వదిలేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డబ్బులు ఇప్పించి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోని పాఠశాల నిర్మాణం పున ప్రారంభించాలని విద్యార్థిని తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు.

By : Jaleel,  ManaSakshi

MOST READ : 

  1. KTR : దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. కేటీఆర్ సవాల్..!

  2. Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!

  3. Murder : వీడిన సహస్ర హత్య మిస్టరీ.. అసలు ఎందుకు హత్య చేశాడో తెలుసా..!

  4. Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

  5. ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!

మరిన్ని వార్తలు