Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!

Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!

పెన్ పహాడ్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో ని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ కి 2024- 25 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది.

రాష్ట్ర విద్యాశాఖ (ఎసీ సీఈఆర్టీ, స్కూల్ లీడర్ షిప్ అకాడమీ) ప్రచురించే ‘ట్రైల్ బ్లేజర్స్’అనే పుస్తకంలో ‘ రియల్ చేంజ్ త్రు ప్రాక్టికల్ ఎఫట్స్’అనే టైటిల్ తో ఈ పాఠశాలకు చోటు దక్కడం గొప్ప విషయం. విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల పనితీరు, కమ్యూనిటీ ప్రోత్సాహం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో 51 పాఠశాలలను ఎంపిక చేశారు.

ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో అనాజీపురం మోడల్ స్కూల్స్ లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు (బెస్ట్ ప్రాక్టీసెస్) స్పోకెన్ ఇంగ్లీష్ సంబందించిన ఉయ్ టాక్ సమస్యలు-సూచనల పెట్టె, విజన్- నెల వారి స్కూల్ మ్యాగజైన్, పుట్టినరోజు న సబ్బుల వితరణ మరియు బ్యూటీ &వెల్నెస్ సంబందించి ఆఫ్టర్ స్కూల్ సపోర్ట్ గురించి సవివరంగా 6 పేజీలు ప్రచురించడం జరిగింది.

తమ పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ కోడి లింగయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఆర్టికల్ లో భాగస్వాములు అయిన టీచర్స్ కు జిల్లా విద్యాశాఖ అభినందించినట్లు తెలిపారు.

MOST READ : 

  1. Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!

  2. SRR : పీహెచ్డీ పరిశోధన కేంద్రంగా ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల..!

  3. ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!

  4. Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!

  5. PMKY : రైతుల ఖాతాలలోకి రూ.18 వేలు.. ఇలా చేస్తే చాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు