Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రైతులకు యూరియా కష్టాలు..!

Miryalaguda : రైతులకు యూరియా కష్టాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మండలంలోని యాదగిరిపల్లి గ్రామంలో యూరియా కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి రైతులతో మాట్లాడి వారి విషయాలను తెలుసుకున్నారు. రైతుల యూరియా కష్టాలు ఇంకెన్నడు తీరును అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు గంటలు తరబడి క్యూలో నిలబడి ఒక్కొక్క మనిషికి రెండు బస్తాల చొప్పున ఇవ్వడం వలన రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి యుద్ధ ప్రాతిపదిక పైన ఈ రాష్ట్రానికి అవసరమైనంత యూరియా పంపించాలని డిమాండ్ చేశారు.

ఈ రాష్ట్రంలో రైతులు అనేక జిల్లాలలో మండలాలలో యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు కాసినా కూడా యూరియా దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. రైతులు అప్పనబోయిన వెంకటయ్య, వస్కుల రవి, కన్ని కంటి రామకృష్ణ, పురుషోత్తం, చింతమల రాములు, గువ్వల ముట్టయ్య, సిహెచ్ ఆంజనేయులు, బొబ్బిలి ప్రశాంత్, గువ్వల శేఖర్, ప్రతాప్, బంటు నరసయ్య, వెంకన్న, రామలింగయ్య, లక్ష్మీ,లక్ష్మమ్మ యశోద తదితర రైతులు ఉన్నారు.

MOST READ : 

  1. ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!

  2. Gold Price : గోల్డ్ ఆల్ టైమ్ రికార్డ్.. ఈరోజు తులం ఎంతో తెలిస్తే షాక్..!

  3. Open School : ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు..!

  4. Suryapet : సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు