తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. స్తంభించిన రోడ్లు..!

Nalgonda : యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. స్తంభించిన రోడ్లు..!

గుర్రంపోడు, మన సాక్షి :

జిల్లాలో రైతాంగం యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు ఎరువుల దుకాణాల వద్ద రాత్రింబగళ్లు క్యూ కడుతున్నారు. యూరియా సరఫరా తక్కువగా రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా గుర్రంపోడు రైతుసేవా కేంద్రం ఎదుట పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. నిర్వాహకులు స్టాక్ లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు నల్లగొండ – దేవరకొండ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి.

మండలానికి కావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు జోరుగా పడుతున్నా ఎరువు దొరకక సాగు పనులు వాయిదా పడుతున్నాయి. గత ఇరువై రోజులుగా యూరియా దొరుకుతుందనే నమ్మకంతో రైతు కేంద్రాల వద్ద రోజూ క్యూ కడుతున్నా రైతుల గోడు తీరడం లేదు. కాంగ్రెస్ పాలనలో మాత్రం యూరియా కోసం నడిరోడ్డుపై బైఠాయించాల్సి వస్తోంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరి నాట్లు వేసి నెల రోజులు గడిచిపోయింది. పత్తి, మక్క, తదితర పంటలకు యూరియా వేసే సమయం ఆసన్నమైంది. అయినా సరఫరా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అధికారులు మూడు రోజుల్లో వస్తుందని చెబుతున్నారు. కానీ ఎప్పటిలాగే మాటలు మాత్రమే మిగులుతున్నాయి. ఉదయం నుంచి రాత్రివరకు పేగులు మాడ్చుకొని కాపలా కాస్తున్నా యూరియా మాత్రం అందడం లేదు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో రైతు ఒక బస్తా కోసం రెండు వారాలుగా తిరుగుతున్నా యూరియా దొరకట్లేదు. తెల్లవారు జామున 5 గంటలకే బారులు తీరినా, కొద్ది మందికే ఇస్తున్నారు. మిగిలిన వారు నిరాశగా వెనుదిరుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే యూరియా కొరత తీర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చివరికి పోలీసులు సముదాయించడంతో రైతులు ధర్నా విరమించారు.

MOST READ : 

  1. Cyber crime : ఆన్‌లైన్ మోసం.. రూ.2.80 లక్షలు పోగొట్టుకున్న గృహిణి..!

  2. Aadhaar Centers : మనసాక్షి కథనానికి స్పందన.. దేవరకొండలో ఆధార్ కేంద్రాలలో అధిక రుసుము వసూళ్లపై అధికారుల విచారణ…!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..!

  4. ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!

మరిన్ని వార్తలు