Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..!

ధర్మారం, మన సాక్షి,

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ధర్మారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. పత్తిపాక గ్రామంలోని పల్లె దవాఖానా, అంగన్వాడి సెంటర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, మల్లాపూర్ లోని సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్, బంజేరుపల్లి లోని ప్రాథమిక పాఠశాల, లంబాడి తండా లోని ప్రాథమిక పాఠశాల, ధర్మారం గెస్ట్ హౌస్, తహసిల్దార్ కార్యాలయం ఎంపీడీవో కార్యాలయం, నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన పనులను కలెక్టర్ పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,పత్తిపాక ఉన్నత పాఠశాలలో ర్యాంపు, అంతర్గత రోడ్డు, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. మల్లాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నందు వంట గది సెక్షన్ , డార్మెంటరీ మరమ్మత్తులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.

లంబాడితండా (బి) ప్రాథమిక పాఠశాలలో ప్రహరి గోడ నిర్మాణానికి కలెక్టర్ నిధులు మంజూరు చేశారు. ధర్మారం మండలంలో ఉన్న పంచాయతీ రాజ్ అతిథి గృహం మరమ్మత్తు పనులను కలెక్టర్ పరిశీలించారు.
ఎంపీడీవో కార్యాలయం పరిశీలించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, మండలంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండ్ చేయాలని, లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, నిరుపేదలకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయలు ముందస్తు రుణం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం ధర్మారం మండలంలో కోటి 56 లక్షల ఎంతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పనులను పరిశీలించి పనులు 40 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ధర్మారం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి రమేష్, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ రాజశేఖర్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!

  2. Aadhaar Centers : ఆధార్ కేంద్రాల్లో దోపిడీ.. అదనపు వసూళ్లు.. పట్టించుకోని అధికారులు..!

  3. Urea : యూరియా కోసం క్యూలో పట్టాదారు పాసు పుస్తకాలు.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు..!

  4. Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!

  5. Karimnagar : వైద్యం కోసం వెళ్తే.. మత్తు ఇచ్చి యువతీపై అఘాయత్నం..!

  6. Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి మరోసారి అదే మాట.. ఎంతటి పోరాటానికైనా సిద్ధం..! 

మరిన్ని వార్తలు