Drinking water : నేటి నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత.. ఎన్ని రోజులో తెలుసా..!

Drinking water : నేటి నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత.. ఎన్ని రోజులో తెలుసా..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు శంకర్‌పల్లి మున్సిపాల్టీ, మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ చేవెళ్ల సబ్ డివిజన్ ఈఈ చల్మారెడ్డి తెలిపారు.
.రంగారెడ్డి జిల్లాలోని కామదానం నుండి కడ్తాల్ మధ్యలో గేట్ వాల్స్, పైప్ లైన్ల మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయని, అందువల్ల సెగ్మెంట్లోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాలలో నీటి సరఫరా 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉండదని తెలిపారు.
ఈ విషయం ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శులకు తెలిపారని చెప్పారు. అలాగే చేవెళ్ల, శంకర్ పల్లి, మొయినాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ కు తెలియజేశారని చెప్పారు. నాలుగు రోజులు ఆదివారం వరకు మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని, అందుకు తాము చింతిస్తున్నామని తెలిపారు. అన్ని గ్రామాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
MOST READ :
-
Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!
-
Aadhaar Centers : మనసాక్షి కథనానికి స్పందన.. దేవరకొండలో ఆధార్ కేంద్రాలలో అధిక రుసుము వసూళ్లపై అధికారుల విచారణ…!
-
Water Supply : 258 గ్రామాలకు రేపటి నుంచి నీటి సరఫరా నిలిపివేత..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..!
-
Water Well : బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి.. కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!









