District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..! పేదలకు అన్ని రకాల వైద్య సేవలు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..! పేదలకు అన్ని రకాల వైద్య సేవలు..!
దేవరకొండ, మన సాక్షి :
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవల అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, బుధవారం ఆస్పత్రికి వచ్చిన రోగుల ఓపి, ఏఎన్ సీ, శానిటేషన్ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
అంతేకాక వివిధ రకాల రిజిస్టర్ ల నిర్వహణను ఆమె పరిశీలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి ప్రకాష్ జిల్లా కలెక్టర్ కు ఆస్పత్రిపని తీరును వివరించారు .అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్డీవో కార్యాలయ నూతన భవన నిర్మాణానికి గాను డిండి రోడ్ లో స్థలాన్ని పరిశీలించారు.
దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్, దేవరకొండ ఏరియా ఆసుపత్రి సూపరింటిండెంట్ రవి ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ , తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో డేనియల్, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
MOST READ :









