Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలురంగారెడ్డి

Ex Municipal Chairperson : ఛండీహోమం నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్..!

Ex Municipal Chairperson : ఛండీహోమం నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్..!

శంకర్‌పల్లి, (మన సాక్షి) :

శక్తి ఆరాధన ద్వారా భయం తొలగుతుందని శంకర్‌పల్లి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. పట్టణ పరిధిలోని 12వ వార్డు విఠలేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో మంగళవారం 9వ రోజు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ జోషి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, చండీ హోమంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం మాజీ చైర్పర్సన్ మాట్లాడుతూ శాంతి సౌభాగ్యాలతో ప్రతి ఒక్కరు జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆమె చెప్పారు. అమ్మవారి ఆరాధనతో ధైర్యం పెరుగుతుందన్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరూ భక్తి,శ్రద్ధలతో దసరా పండుగను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

MOST READ : 

  1. Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

  2. Nalgonda : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం.. బతుకమ్మ పండుగ..!

  3. Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!

  4. Miryalaguda : వాడపల్లి యాస్సైపై ఎస్సీ ఎస్టీ శాఖ పరమైన చర్యలకు ఆదేశాలు..!

మరిన్ని వార్తలు