Miryalaguda : వాడపల్లి యాస్సైపై ఎస్సీ ఎస్టీ శాఖ పరమైన చర్యలకు ఆదేశాలు..!

Miryalaguda : వాడపల్లి యాస్సైపై ఎస్సీ ఎస్టీ శాఖ పరమైన చర్యలకు ఆదేశాలు..!
దామరచర్ల, మన సాక్షి :
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్దు అనే యువకుడి పై గత 9వ,తేదిన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్ కి చెందిన ఎస్ఐ మరియు వారి సిబ్బంది విచక్షణారహితంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని భౌతిక దాడులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగిందనే అంశంపై ఎస్సీ,ఎస్టీ కమిషన్ లో బాధితుని బంధువులు ఫిర్యాదు చేయగా, వాస్తవ అంశాలను పరిశీలించుట కొరకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదివారం స్వయంగా బాధితుని స్వగృహానికి వచ్చి సంఘటనకు గల పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బాధితుడు తెలిపిన వివరాలు అనంతరం బాధితునికి ప్రభుత్వం నుండి చుట్ట పరంగా న్యాయం చేస్తానని అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంబంధిత వాడపల్లి ఎస్సై,పోలీస్ సిబ్బందిపై తగు చట్టపరమైన మరియు శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా న్యాయం చేయుట కొరకు మా వంతుగా ప్రయత్నిస్తానని బాధితుని భార్య మరియు కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది.
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా నేరం చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలే తప్పా పోలీసులకు అధికారం ఉందని ఇలా ఇష్టం వచ్చినట్లుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయకూడదని,నేరం మోపబడిన వారిపై న్యాయ విచారణ జరిపి చట్టపరంగా శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
ఈ విచారణ అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తన చరవాణి ద్వారా తెలియజేయడం జరిగింది.
బాధితుడు పై పోలీసులు దాడికి గల కారణాలు
ఇదే నెలలో గత 2వ,తేదీన బాధిత కొత్తపేట గ్రామానికి చెందిన దగ్గరి బంధువులతో వాగ్వాదం జరగగా ఇరువురి మధ్య సంఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ప్రస్తుత బాధితుడు మరియు వ్యతిరేక పక్షం వర్గం ఇరువురు వాడపల్లి పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం జరిగింది.
దానిలో భాగంగానే ఎస్సై మాపై ఉద్దేశపూర్వకంగా స్థానిక రాజకీయనాయకుల ప్రొద్భలంతో ఫిర్యాదు చేసిన వారం రోజులకు ఈనెల 9వ, తారీఖున ఉదయం 6 గంటలకు నిద్రిస్తున్న నన్ను పోలీస్ సిబ్బంది చొక్కా పట్టి లాగి ఈడ్చుకుంటూ తన ద్విచక్ర వాహనంపై పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నన్ను నాన్న రకాలుగా భౌతిక దాడులకు గురిచేసి అదే రోజున సాయంత్రం 4 గంటలకు మిర్యాలగూడ న్యాయస్థానం జడ్జి ముందు హాజరు పరచగా సంబంధిత బాధితుడికి జరిగిన పోలీసు సిబ్బంది నిర్వాకం మొత్తం వివరించడం జరిగిందని వెంటనే నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేయించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
వైద్యం అనంతరం సంబంధిత డాక్టర్ భౌతిక దాడులు జరిగినట్లు నిర్ధారణ నివేదిక ఇవ్వటం జరిగిందని.దాని ఆధారంగా షరతులతో కూడిన బెయిల్ ను అరెస్టు చేసిన 14రోజుల అనంతరం మంజూరు చేయడం జరిగిందని, కావున నాపై చట్ట వ్యతిరేమైన భౌతిక దాడులకు పాల్పడిన సంబంధిత ఎస్సై మరియు వారి పోలీస్ సిబ్బందిపై తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకి విజ్ఞప్తి ద్వారా అభ్యర్థించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటుగా,వారి సిబ్బంది, స్థానిక మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు,మార్కెట్ మాజీ చైర్మన్ చిట్టి బాబు నాయక్, మాజీ జడ్పీటీసీ లలిత హతిరం, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
- Miryalaguda : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!
- Miryalaguda : రాష్ట్రస్థాయికి ఎంపికైన అభ్యాస్ స్కూల్ విద్యార్థులు..!
- RRR ; ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన త్రిబుల్ఆర్ భూ నిర్వాసితులు..!
- Nelakondapalli : రూ.5 కోట్ల తో బౌద్ధక్షేత్రం చరిత్ర ప్రపంచం కు తెలిసేలా అభివృద్ధి..!
- Groups : డీఎస్పీ ఉద్యోగం సాధించిన జిన్నాయిచింత యువకుడు..!









