Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం

RRR ; ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన త్రిబుల్ఆర్ భూ నిర్వాసితులు..!

RRR ; ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన త్రిబుల్ఆర్ భూ నిర్వాసితులు..!

సంస్థాన్ నారాయణపురం, మన సాక్షి :

త్రిపుల్ఆర్ దక్షిణ భాగం రహదారి కింద మునుగోడు నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ పట్టణం, చౌటుప్పల్ మండలం, సంస్థాన్ నారాయణపూర్ మండలం, గట్టుప్పల్ మండలం, మర్రిగూడెం మండలాలకు చెందిన భూ నిర్వాసితులు మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసారు.

దక్షిణ భాగంలో అలైన్మెంట్ను మార్చారని దివిస్ కంపెనీకి లాభం చేకూరేలా రైతుల పొట్ట కొడుతున్నారని రాజ్ గోపాల్ రెడ్డికి తెలిపారు. భూ నిర్వాసితులు, భూమిపోతే జీవనమే పోతుందని మాకు న్యాయం చేయాలని కోరుతూనే భూమికి భూమి ఇవ్వడమే మా నినాదం అని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు.

తమకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భూమికి రైతుకు మధ్య భావోద్వేగ బంధం ఉంటుంది.

ఇది చాలా సున్నితమైన సమస్య.భూమి కోల్పోతున్న బాధలో మీరు పడుతున్న ఆవేదనకు మీరు చేస్తున్న డిమాండ్లతో నేను ఏకీభవిస్తున్న.పార్టీ కంటే,ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యం అనే భావనతో ఆలోచన చేస్తున్నా. భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి దక్షిణ భాగం రహదారి వెళ్తున్న నియోజకవర్గాల శాసన సభ్యులతో కూడా మాట్లాడుతున్న. ఈ విషయంలో అందరు ఎమ్మెల్యేలు ఆవేదనతో వున్నారు.

అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన మాట్లాడతా.పదవి అంటే కిరీటం కాదు పదవి అంటే బాధ్యత.దర్మం వైపు న్యాయం వైపు ఉంటాడు రాజ్ గోపాల్ రెడ్డి సగం మునుగోడు నియోజకవర్గం త్రిబుల్ఆర్ లో కలుస్తుంది.

అలైన్ మెంటు మార్చడానికి కారణాలను రైతులకు వివరించి ఒప్పించి నిర్ణయం తీసుకోవాలి. ప్రతిపక్షాలు మిమ్మల్ని తప్పుతోవ పట్టిస్తున్నాయి. మీకు న్యాయం చేసేవారి వైపు, మీకోసం కొట్లాడే వారి వైపు ఉండండి.. 2017 లో శివన్నగూడెం ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ పరిహారం మాత్రం 2023 లో నేను రాజీనామా చేసిన తరువాత పూర్తి చేశారన్నారు.

త్రిబుల్ఆర్ వెళ్లే నియోజకవర్గ ఎమ్మెల్యేలందరం కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడుతామని భూ నిర్వాసితులకు ఎన్ని పార్టీలు అయినా ఉండని, మీకు నాయ్యం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను అని అన్నారు.

చౌటుప్పల్ వరకు వచ్చే సరికి త్రిబుల్ఆర్ అలైన్ మెంట్ దగ్గరికి తీసుకొచ్చారు.ఉత్తర భాగంలోనే అలైన్ మెంట్ విషయంలో తప్పు జరిగింది. ఇపుడు దక్షిణ భాగంలో కూడా ఆ తప్పు ను కొనసాగిస్తున్నారు అని అన్నారు.

MOST READ : 

  1. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. అప్రమత్తంగా ఉండాలి..!

  2. Miryalaguda : యూరియా కోసం ధర్నా చేసిన యువకుడు.. చితక్కొట్టిన పోలీసులు..! 

  3. Singareni : 1258 మంది సింగరేణి బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ..! 

  4. Applications : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!

మరిన్ని వార్తలు