Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల విధులు నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల విధులు నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలి..!

ఖమ్మం, మన సాక్షి :

స్థానిక ఎన్నికల నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్ మధిర నియోజకవర్గంలో అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి బుధవారం పర్యటించారు. మధిర మండలం పరిధిలోని 175 మంది స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కళ్యాణ వేదిక నందు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ట్రైనింగ్ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగహన కల్పిస్తూ ఎన్నికల విధుల పట్ల కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రతి అధికారి కొత్తగా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు భావించి జాగ్రత్తగా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించడానికి వీలు లేదని అన్నారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఈవిఎం యంత్రాలతో జరిగితే, స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరుగనున్నాయి అని, ప్రతి చిన్న అంశాన్ని, అనుమానాలను శిక్షణలో పూర్తి స్థాయిలో విచారించి తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. ట్రైనింగ్ హాల్ నుంచి సంపూర్ణ అవగాహన తో బయటకు పోవాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలంటే నిబంధనలపై సంపూర్ణ పట్టు ఉండాలన్నారు.

రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రి తీసుకున్న దగ్గర నుంచి మళ్లీ అప్పగించే వరకు పూర్తి బాధ్యత పోలింగ్ సిబ్బందిపై ఉంటుందని అన్నారు. రిజర్వ్ ఉన్న అధికారులు కూడా రిపోర్ట్ చేయాలని అన్నారు. శిక్షణకు రాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో మనం చేసే ప్రతి పని నిబంధనల ప్రకారం జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర తహసీల్దారు రాంబాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అరెస్ట్..!

  2. Nalgonda : జిల్లా వ్యవసాయాదికారి రైతులకు కీలక సూచన.. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..! 

  3. Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!

  4. Paddy : వరిలో దోమపోటు నివారణకు చర్యలు.. ఏ మందు పిచికారి చేయాలి..!

మరిన్ని వార్తలు