Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!

District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!

నల్లగొండ, మన సాక్షి :

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్ ఎల్ బి సి కాలని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసిననట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎస్ ఎల్ బి సి కాలనీలో ఉన్న తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్సియల్ పాఠశాలను ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.

తనిఖీ సందర్భంగా ప్రిన్సిపాల్‌ వేణు గోపాల్ పాఠశాల సమయంలో భోజనం కోసం బయటకు వెళ్లడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ వసతి గృహం ఆవరణలోనే భోజనం చేయాలని నియమం ఉన్నప్పటికీ, ఆయన దానిని ఉల్లంఘించారు.

దీంతో పాటు, పాఠశాల భవనం,ఆవరణ అపరిశుభ్రమైన స్థితిలో, సరైన నిర్వహణ లేని పరిస్థితులలో ఉండటంతో పాటు, ప్రధాన పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రిన్సిపాల్ విఫలమైనట్లు కలెక్టర్ గుర్తించారు. అంతేకాక​ కొందరు ఉపాధ్యాయులు సైతం పాఠశాల సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరు అయినట్లు కలెక్టర్ గుర్తించారు.

​పై లోపాలన్నీ ప్రిన్సిపాల్ విధులలో తీవ్రమైన అలసత్వాన్ని, పర్యవేక్షణ లోపాన్ని , క్రమశిక్షణా రాహిత్యాన్ని సూచిస్తున్నాయని, ఇది ప్రభుత్వ నియంత్రణలో నడిచే ఒక రెసిడెన్షియల్ సంస్థకు ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ కు షో కాజ్ నోటీస్ జారీ చేశారు. షో కాజ్ నోటీస్ కు( 3 )రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని లేదంటే క్రమ శిక్షణా చర్యలు తీసుకొంటామని కలెక్టర్ తెలిపారు.

MOST READ : 

  1. Paddy : వరి పంటకు సుడిదోమ, కంకినల్లి నివారణ.. పిచికారి చేయాల్సిన మందులు..!

  2. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

  3. కోడిపందాలపై డ్రోన్ల సహాయంతో పోలీసుల దాడులు.. ఐదుగురు అరెస్ట్..!

  4. Paddy : వరిలో దోమపోటు నివారణకు చర్యలు.. ఏ మందు పిచికారి చేయాలి..!

మరిన్ని వార్తలు