తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Suryapet : ఆయిల్ పామ్ సాగు పై క్షేత్ర సందర్శన కు వెళ్లిన రైతులు..!

Suryapet : ఆయిల్ పామ్ సాగు పై క్షేత్ర సందర్శన కు వెళ్లిన రైతులు..!

హుజుర్ నగర్, మనసాక్షి :

ఆయిల్ పామ్ తోటల సాగులో మెలుకువలు తెలుసుకొనేందుకు హుజుర్ నగర్ డివిజన్ పరిధిలోని మండలాలకు చెందిన పలువురు రైతులు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి, దమ్ముపేట మండలాలకు క్షేత్ర సందర్శనకు వెళ్లారు. ఇట్టి కార్యక్రమంను హుజుర్నగర్ డివిజన్ ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి ప్రదీప్తి జెండా ఊపి ప్రారంభించారు.

హుజుర్నగర్ డివిజన్ మండలాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేయాలనుకునే రైతులు క్షేత్ర సందర్శకు వెళ్లి ఆయిల్ పామ్ సాగుచేస్తున్న రైతులతో ముఖా ముకి చర్చించారు. ఈసందర్బంగా పంట సాగులో ఉండే కష్టా, నష్టాలు, పంట దిగుబడి, పంటను అమ్ముకునే విధానాన్ని నేరుగా అభ్యుదయ రైతులనుండి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దమ్ముపేట లో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరిని రైతులు సందర్శించి అక్కడ ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అదేవిదంగా ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలు గా సాగు చేస్తున్న కోకో, వక్క, జాజ్జికాయ, మిర్యాలు, తమలపాకు తోటలను సందర్శించి రైతుల అనుభవాలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమం లో ప్రాంతీయ ఉద్యాన అధికారిని ప్రదీప్తి, పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ జిల్లా మేనేజర్ జే హరీష్, ఫీల్డ్ ఆఫీసర్ సాయి, శ్రీరామ్, క్షేత్ర సహాయకులతొ పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Heavy Rain : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!

  2. TG News : తెలంగాణ రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!

  3. Alumni : 33 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. గత జ్ఞాపకాలతో పూర్వ విద్యార్థులు..!

  4. District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!

  5. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

మరిన్ని వార్తలు