District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!

District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!
నల్లగొండ, మన సాక్షి :
2025- 26 వానాకాలం ధాన్యం సేకరణ సందర్బంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ప్రారంభించారు.
ధాన్యం సేకరణకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సలహాలు, సూచనలను ఈ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 9281423653 కు కాల్ చేసి తెలియజేయాలని లేదా రాష్ట్రస్థాయి లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1967 లేదా 18004250033 కి తెలియజేయవచ్చని ఆమె వెల్లడించారు.
జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు ఇది వరకే ప్రారంభమైందని కొనుగోలు కేంద్రాలలో ముమ్మరంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. అయితే ధాన్యం సేకరణకు సంబంధించిన సమస్యలపై కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, మిల్లర్లు, అలాగే రైస్ మిల్లులలో అన్లోడింగ్ సమస్యలు, కొనుగోలు కేంద్రాలలోని సమస్యలు ఈ కంట్రోల్ రూమ్ లోని పైన పేర్కొన్న ఫోన్ నంబర్లకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెలియజేయవచ్చని చెప్పారు.
ఈ కంట్రోల్ రూమ్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని, ఈ కంట్రోల్ రూమ్ లో పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, పోలీస్, డిఆర్డిఓ తదితర శాఖలకు సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు విడతల్లో సిబ్బంది కంట్రోల్ రూమ్ లో ఉండి ఫిర్యాదులను స్వీకరిస్తారని, వచ్చిన ఫిర్యాదులు అన్నింటిని రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
తక్షణమే ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు తెలియజేయడం ద్వారా సమస్యలను పరిష్కరించే ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్, జే .శ్రీనివాస్న, ల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా అధికారి వెంకటేష్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జెడ్పి సీఈవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
MOST READ :
-
TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మేఘా జాబ్ మేళా.. 150 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..!
-
Tasildar : నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర.. సన్న వడ్లకు రూ.500 బోనస్..!
-
PMSBY : పీఎం సురక్ష బీమా యోజన.. రూ.20 చెల్లిస్తే చాలు.. 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే..!
-
Apollo : ఖచ్చితమైన ఆయుర్వేద చికిత్స కోసం తెలంగాణలోకి అపోలో ఆయుర్వేద్..!









