TG News : తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే.. అందరూ పాల్గొనాలి..!

TG News : తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే.. అందరూ పాల్గొనాలి..!
పెద్దపల్లి ధర్మారం, మన సాక్షి,
తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో కేవలం తెలంగాణ నుండే వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారు.
భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీ తో ముగుస్తుంది.
ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు , సూచనలను అందించాల్సింగా జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియ చేశారు.
MOST READ :
-
విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం..!
-
TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్..!
-
TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్..!
-
Gold Price : భారీగా రూ.19,100 తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!









