Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం..!

విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం..!

గోదావరిఖని, మన సాక్షి :

శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు త్యాగం, సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లే యోధులు. విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గోన్న రామగుండం పోలీస్ కమిషనర్ తో పాటు మంచిర్యాల జిల్లాల కలెక్టర్ కుమార్ దీపక్ పెద్దపల్లి డిసిపి కరుణాకర్, ఆర్ జి వన్ జి ఎం లలిత్ కుమార్, ఏన్టీపీసీ ,

ఆర్.ఎఫ్ సి.ఎల్ అధికారులు ఏ.సి.పిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు ఎస్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలు వుంచి నివాళులు అర్పించిన పిదప, ఆర్.ఐ మల్లేశం సారధ్యంలో సాయుధ పోలీసులు శోక్ శ్రస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడాలని, ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నితీ, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారని, వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే వుంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో అమరవీరుల కుటుంబ సభ్యులకు అందించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ పోలీస్ అండగా ఉంటుందని ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చినట్లైతే సంబందించిన ప్రభుత్వ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్, గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్, మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, ఎవో శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు ఎస్సైలు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు సిపిఓ సిబ్బంది స్పెషల్ పార్టీ ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు