TOP STORIESBreaking Newsజాతీయంహైదరాబాద్

Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!

Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

బంగారం ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజురోజుకు ధరలు మారుతుండటం గమనిస్తున్నాము. అయితే దేశవ్యాప్తంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన ధర కూడా ఉంటుంది. అందుకు కారణాలు ఏమిటి..? బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు..? ఎలా నిర్ణయిస్తారు..? ఏ సమయంలో ప్రకటిస్తారు..? అనే విషయం చాలామందికి తెలియదు. అది ఎలానో తెలుసుకుందాం..

బంగారం ధర నిర్ణయించేది వీరే :

బంగారం ధర నిర్ణయించే వ్యవస్థను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు పర్యాయాలను ధరలు నిర్ణయించి ప్రకటిస్తుంది. దాని ఆధారంగా ప్రపంచమంతా బంగారం ధరలు అమలు చేస్తుంటారు. అయితే ఆయా దేశాలలో టైం జోన్ ప్రకారం ధరలను వారు నిర్ణయించుకుంటారు.

అయితే ఇండియాలో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్.. ప్రపంచ ధరల ఆధారంగా ఇది నిర్ణయిస్తుంది. ప్రతిరోజు కూడా ప్రపంచ ధరల ఆధారంగా ఇండియన్ కరెన్సీలో ఈ ధరలను నిర్ణయిస్తుంది. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ మారకం, దిగుమతి ఫీజులు, డిమాండ్, సప్లై అంశాలను పరిగణలోకి తీసుకొని బంగారం ధర నిర్ణయిస్తుంది. అందుకుగాను ప్రత్యేకమైన విధివిధానాలు ఉంటాయి. విధి విధానాలను బట్టి ధరలను లెక్కించి నిర్ణయిస్తుంది.

వేరు వేరు ప్రాంతాల్లో వేరువేరు ధరలు :

దేశవ్యాప్తంగా అన్ని నగరాలలో బంగారం ధరలు ఒకేలా ఉండవు. ఒక్కో నగరంలో ఒక్కో ధర ఉంటుంది. స్థానిక జ్యువెలర్స్ అసోసియేషన్ల నిబంధనల ప్రకారం స్థానిక ధరలను నిర్ణయిస్తారు. దాంతో పాటు రాష్ట్రాలలో టాక్స్ ఆధారంగా ధరలు మారుతుంటాయి. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ఉన్న నగరాలలో బంగారం ధరలలో కేవలం కొద్దిపాటి మార్పు మాత్రమే ఉంటుంది. దానిని లోకల్ బులియన్ అసోసియేషన్ నిర్ణయిస్తుంది.

MOST READ NEWS : 

  1. Rythu : రైతులకు భారీషాక్.. యూరియా, ఎరువుల ధరలు పెరిగేనా..!

  2. Gold Price : బంగారం ధరలు ఒకేసారి ఢమాల్.. ఒక్కరోజే రూ.33,800 తగ్గింది..!

  3. TG News : తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే.. అందరూ పాల్గొనాలి..!

  4. Health : యూరిక్ యాసిడ్ సమస్య ఉందా.. ఉపశమనం పొందడం ఎలా..!

మరిన్ని వార్తలు