Rythu : రైతులకు భారీషాక్.. యూరియా, ఎరువుల ధరలు పెరిగేనా..!

Rythu : రైతులకు భారీషాక్.. యూరియా, ఎరువుల ధరలు పెరిగేనా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఇటీవల యూరియా దొరకకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఇలా ఉండగా రైతులకు మరో భారీ షాక్ తగలనున్నది. యాసంగి సీజన్ ప్రారంభం నాటికి ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. యూరియాతో పాటు కొన్ని ఎరువుల ఎగుమతిని ఈ నెల 15 నుంచి చైనా నిలిపివేసింది.
ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంపై పడే అవకాశం ఉంది. దానివల్ల మరో 5, 6 నెలల్లో ఎరువుల కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమ్మోనియం పాస్పేట్, యూరియా, డిఎపి వంటి ఎరువులను 95% పైగానే భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది.
ఇప్పుడు చైనా ఆంక్షలుతో వాటి ధరలు పది నుంచి పదిహేను శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం భారత్ కు 2.5 లక్షల టన్నుల ప్రత్యేక ఎరువులు వినియోగిస్తుంది. వాటిలో సుమారు యాసంగి సీజన్ లోనే 60 నుంచి 65% వినియోగిస్తున్నాము. ఇప్పుడు చైనా ఆక్షల వల్ల రబీ సీజన్లో రైతులకు మరిన్ని కష్టాలు రాబోతున్నాయి.
MOST READ :
-
District collector : తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే.. అందరు భాగస్వాములు కావాలి..!
-
Job Mela : 205 కంపెనీలచే మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
-
Gold Price : బంగారం ధరలు తగ్గుతున్నాయా.. పెరిగిందా.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Gold Price : భారీగా రూ.19,100 తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!









