District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. రైతులు విడతల వారీగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. రైతులు విడతల వారీగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి..!
నల్లగొండ, మన సాక్షి :
రైతులు విడతల వారీగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
మంగళవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధాన్యం సేకరణ పై సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆకాల వర్షాలు సవాల్ గా మారాయని , ఒకేసారి రైతులు కొనుగోలు కేంద్రాలకు మిల్లులకు ధాన్యం తీసుకురావడం వల్ల ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, అలా కాకుండా విడతల వారీగా ధాన్యాన్ని తీసుకు వచ్చినట్లయితే కొనుగోలు కేంద్రాలతో పాటు, మిల్లులలో ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయవచ్చని చెప్పారు.
ఇందుకుగాను వ్యవసాయ శాఖ వరి పంట కోతల ఆధారంగా ఒక షెడ్యూల్ ను రూపొందించాలని ఆదేశించారు. ఒకేసారి వరి కోతలు జరగకుండా ఇదివరకే డివిజన్ల వారిగా హార్వెస్టర్లతో సమావేశాలు నిర్వహించడం జరిగిందని, మిర్యాలగూడ ప్రాంతంలో సన్నధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఒక్కోసారి మిల్లుల వద్ద ట్రాక్టర్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని కోరారు.
ప్రత్యేకించి సన్నధాన్యం కొనుగోలు విషయంలో తేమ, ఇతర అంశాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రతి మిల్లులో ధాన్యం వాహనాలు వచ్చేందుకు, వెళ్లేందుకు ప్రత్యేకదారులు ఏర్పాటు చేయాలని కోరారు .పత్తి కొనుగోలుకు సంబంధించి రైతులు స్లాట్ బుక్ చేసుకుని ఏదైనా కారణం చేత పత్తిని అమ్మన్నట్లయితే స్లాట్ ను రద్దు చేసుకోవచ్చని, రైతుకుండే మూడు స్లాట్లు అలాగే ఉంటాయని, ఈ విషయంపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
8 నుండి 12% తేమ ఉంటే వెంటనే పత్తి కొనుగోలు కేంద్రానికి వెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని ,తేమను పరిశీలించుకునేందుకు ప్రతి క్లస్టర్ కు ఒక మిషన్ ఇవ్వడం జరిగిందని, రైతులు వారికి సంబంధించిన క్లస్టర్ లో పత్తి తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాత ఎంత తేమ ఉందో తెలుసుకొని కొనుగోలు కేంద్రాలకి వెళ్లాలని ఆమె సూచించారు.
జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు, జిల్లా యంత్రాంగానికి, మిల్లర్లకు ఇబ్బందులు కలగకుండా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం పోలీస్ శాఖ తరపున అవసరమైన సహకారం అందిస్తామని, అయితే ఒకేసారి ధాన్యం రాకుండా విడతలవారీగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరం అయితే టోకెన్లు జారీ చేయడం లేదా ముందే ధాన్యం వచ్చే వివరాలను షెడ్యూల్ రూపొందించి తమకు ఇవ్వాలని, దాని ప్రకారం తాము సహకారం అందిస్తామని తెలిపారు.
ధాన్యం సేకరణ ముగిసే వరకు దాన్యం సేకరణలో భాగస్వామ్యం ఉన్న అన్ని శాఖల అధికారులు వారి వారి కార్య స్థానాలలో అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ తో విజ్ఞప్తి చేశారు. అలాగే అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లలో విధులకు ఆదేశించిన సిబ్బంది అందరూ ఉండాలని కోరారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఆరు లక్షల 13 వేల మెట్రిక్ టన్నుల దాన్యం ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటివరకు లక్ష అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని, మిర్యాలగూడ ప్రాంతంలో మిల్లులకు సన్నధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో మిల్లర్లు రైతులకు నష్టం కలగకుండా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని కోరారు.
రైస్ మిల్లర్ల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, భద్రాద్రి మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతంలో ప్రతిరోజు 4000 నుండి 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉందని, నవంబర్ 10నుండి 15 మధ్య ఎక్కువగా ధాన్యం వచ్చే అవకాశం ఉందని ,రైతులు నాణ్యత ప్రమాణాలతోనే ధాన్యాన్ని తేస్తే బాగుంటుందని సూచించారు.
దేవరకొండ ఏసిపి మౌనిక, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ,ఆర్డీవోలు రమణారెడ్డి ,శ్రీదేవి, డిఎస్పి శివరాం రెడ్డి ,రాజశేఖర్ శర్మ, డి సి ఓ పత్యా నాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
MOST READ :
-
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!
-
Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!
-
Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!
-
Gold Price : బంగారం ధరలు మరోసారి పతనం.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!










