Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

రైల్వే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. రాత పరీక్ష లేకుండా రైల్వేలో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

నార్త్ ఈస్టర్న్ కొత్తగా అప్రెంటిస్ ఉద్యోగాలను ప్రకటించింది. ఉత్తర తూర్పు రైల్వే 2025 అప్రెంటిస్ నియామక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1104 పోస్టులకు గాను ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఈ ప్రక్రియలో మెకానికల్ వర్క్ షాప్ గోరఖ్పూర్ లో 390 పోస్టులు, సిగ్నల్ వర్క్ షాప్ గోరక్ పూర్ కాంట్ లో 63, బ్రిడ్జి వర్క్ షాప్ గోరఖ్ పూర్ కాంట్ లో 35, మెకానికల్ వర్క్ షాప్ ఇజ్జత్ నగర్ లో 142, డీజిల్ షెడ్ ఇజ్జత్ నగర్ లో 60, క్యారేజ్ అండ్ వేగన్ ఇజ్జత్ నగర్ లో 64, క్యారేజ్ అండ్ వేగన్ లక్నో జంక్షన్ లో 149, డీజిల్ షెడ్ గుంట్ లో 88, క్యారేజ్ అండ్ వేగన్ వారణాసిలో 73, టీఆర్టీ వారణాసిలో 40 పోస్టులు, మొత్తం 1104 పోస్టులకు గాను నోటిఫికేషన్ వెలువడింది.

అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఈ అర్హతలు అక్టోబర్ 16, 2025 నాటికి కనీస వయసు 15 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి.

ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 27 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీలకు 29, దివ్యాంగులకు 34 సంవత్సరాల వరకు అర్హత ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 100 రూపాయల సాధారణ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తును ఆన్‌లైన్ మాత్రమే చెల్లించాలి.

మెరిట్ ఆధారంగా ప్రాధాన్యత ఉంటుంది. ఆన్లైన్లో ఇచ్చిన వివరాల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు గోరఖ్ పూర్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ప్రింట్ చేసిన దరఖాస్తు ఫారం తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని హాజరు కావాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం అధికారిక వెబ్సైట్ https://ner.indianrailways.gov.in ద్వారా సందర్శించి Apprentice Recruitment 2025 పై రిజిస్టర్ చేసుకొని ఫారం ప్రింట్ తీసుకోవాలి.

MOST READ : 

  1. Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!

  2. Miryalaguda : రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..!

  3. Friendship : స్నేహమంటే ఇదే.. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు..!

  4. Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

  5. Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

మరిన్ని వార్తలు