Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..!

Miryalaguda : రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లకు దరఖాస్తు స్వీకరించనున్నట్లు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు. మిర్యాలగూడ మండలంలోని చింతపల్లిలో గల రేషన్ దుకాణం (జనరల్), అడవిదేవులపల్లిలో బాల్నేపల్లి గ్రామంలో గల రేషన్ దుకాణం(బీసీ జనరల్)లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు.

18 నుంచి 40 సంవత్సరాలు కలిగి నవారు, పదవ తరగతి ఉత్తీర్ణత ఆపైనా విద్యార్హతలు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లను, కులం, ప్రాంతీయ దృవీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి మూడు కలర్ ఫోటోలతో వచ్చే నెల (నవంబర్) 6లోపు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు 80 మార్కులతో రాత్ర పరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా నియమించినట్లు తెలిపారు.

MOST READ : 

  1. Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

  2. Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

  3. Wrong Route : రాంగ్ రూట్ లో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. చలాన్లు చూసి కంగుతిన్నారు..!

  4. Hand Ball : రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన జడ్పీ హైస్కూల్ విద్యార్థులు..!

మరిన్ని వార్తలు