Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Wrong Route : రాంగ్ రూట్ లో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. చలాన్లు చూసి కంగుతిన్నారు..!

Wrong Route : రాంగ్ రూట్ లో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. చలాన్లు చూసి కంగుతిన్నారు..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శనివారం నగరంలోని కమాన్ ప్రాంతంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా జరిమానాలు బకాయి ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్, గణేష్ నగర్‌కు చెందిన కట్కోజువాల కిరణ్ కుమార్ అనే వ్యక్తి నడుపుతున్న హోండా షైన్ (TS22 7090) బైక్‌ను తనిఖీ చేయగా, ఆ వాహనంపై ఏకంగా 120 ట్రాఫిక్ ఉల్లంఘనల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ చలాన్లకు సంబంధించి మొత్తం రూ. 29,560 జరిమానా బకాయి ఉన్నట్లు వెల్లడైంది.

వాహన యజమాని కిరణ్ కుమార్ రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తనిఖీలో పట్టుబడినట్లు ఇన్స్పెక్టర్ కుమారస్వామి తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు మరియు భారీ మొత్తంలో జరిమానాలు బకాయి ఉన్నందున, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ కుమారస్వామి వెల్లడించారు.

ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, పెండింగ్‌లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించాలని వాహనదారులకు ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

MOST READ : 

  1. Hand Ball : రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన జడ్పీ హైస్కూల్ విద్యార్థులు..!

  2. Paddy procurement : ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై రైతుల రాస్తారోకో..!

  3. State Level Badminton : రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీలకు శరణ్య ఎంపిక..!

  4. District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. తీగల వంతెన, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలి..!

  5. District SP : జిల్లా ఎస్పీ హెచ్చరిక.. దౌర్జన్యాలు, బెదిరింపులకు గురి చేస్తే కఠిన చర్యలు..!

మరిన్ని వార్తలు