District Sp : మల్లన్న జాతర భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ..!

District Sp : మల్లన్న జాతర భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లనపేట గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అశోక్ కుమార్
అధికారులను ఆదేశించారు.
నవంబర్ 26 తేదీ నుండి డిసెంబర్ 17 వ తేదీ వరకు జరుగు జాతర సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆలయ పరిసరాల్లో, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులకు స్పందించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఎస్పీ వెంట డిఎస్పి రఘు చందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, సి.ఐ రవి, ఎస్.ఐ క్రిషన్ సాగర్ రెడ్డి ఉన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!
-
Ministers WhatsApp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూప్ హ్యాక్..!
-
Miryalaguda : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మిర్యాలగూడ నియోజకవర్గం గ్రామాల వారీగా వివరాలు ఇవీ..!
-
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం.. టికెట్ రేట్లు ఇవీ..!









