Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు పెట్టుబడి సహాయం అందజేసేందుకు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం అమలుకు యాసంగి సీజన్ కు గాను రైతులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయలను అందజేస్తున్న విషయం తెలిసిందే. కాగా వానాకాలం సీజన్ లో ఎకరానికి 6000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేశారు.

2025 -26 యాసంగి సీజన్ ప్రారంభమైనందున ఎకరానికి మరో 6000 చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తారని ఎదురుచూస్తున్నారు. యాసంగి పంటల సీజన్ ప్రారంభమైంది. ఓ పక్క వానాకాలం వంటను విక్రయించుకుంటున్న రైతులు మరో పక్క యాసంగి సాగుకు కూడా సిద్ధమయ్యారు.

వానాకాలం సీజన్ లో అధిక వర్షాల వల్ల రైతులు భారీ నష్టం చవిచూచారు. తుఫాన్ కారణంగా పంట చేతికొచ్చే ముందు నేలపాలైంది. దాంతో కనీసం పెట్టుబడులు కూడా వెళ్ళని పరిస్థితి నెలకొన్నది. రైతులు అప్పుల పాలయ్యారు. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది.

పంట దిగుబడి కూడా భారీగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. కాగా వానాకాలం సీజన్ కు ముందుగానే రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం యాసంగి సీజన్ లో కూడా పంటలు సాగు చేసుకోవడానికి ముందే ఇస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు.

అదేవిదంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఎన్నికలకు ముందే రైతు భరోసా ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందే రైతు భరోసా ఇస్తే రైతులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా

రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలనే విషయంపై ఈనెల 25వ తేదీన క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందు రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ అవుతాయా..? లేదా..? అనేది వేచి చూడాల్సి ఉంది.

MOST READ : 

  1. Nalgonda : కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు.. సీనియారిటీ జాంతానై.. కాంగ్రెస్ నేత ఫైర్..!

  2. RRR : త్రిబుల్ ఆర్ కు భూములు ఇచ్చేది లేదు.. పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన రైతులు..!

  3. KTR : కేటీఆర్ సంచలన ఆరోపణ.. తెలంగాణలో భూ కుంభకోణం..!

  4. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం.. టికెట్ రేట్లు ఇవీ..!

మరిన్ని వార్తలు