Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు.. సీనియారిటీ జాంతానై.. కాంగ్రెస్ నేత ఫైర్..!

Nalgonda : కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు.. సీనియారిటీ జాంతానై.. కాంగ్రెస్ నేత ఫైర్..!

నల్లగొండ, మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు వస్తాయని అలాగే ముఖ్యమంత్రి అనుచరుడైతేనే పదవులు వస్తాయని సీనియారిటీ జాంతానై అని డిసిసి పదవి కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని పదవి రాకపోవడంతో నిరాశ చెందిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

డిసిసి అధ్యక్ష పదవి మునుగోడుకు చెందిన పున్న కైలాస్ నేతకు ఇవ్వడంతో ఆయన ఒక్కింత ఆవేదనతో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తాను పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో పార్టీని ముందుండి నడిపించాన ని కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశానని ఆర్థికంగా నష్టపోయిన కూడా పార్టీ కోసం నిరంతరం జండా మోసి పనిచేశానన్నారు. నల్లగొండలో అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన సభను బట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతం చేశామని తెలిపారు.

తనకు పదవి రాకపోవడం కి ప్రధాన కారణం తన కులం,తాను తిట్టకపోవడం, ముఖ్యమంత్రి అనుచరుని కాకపోవడమే అన్నారు, తమ గురువు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలుచుకుంటే తనకు రాత్రికి రాత్రే రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ పదవి వస్తుందని అన్నారు.

ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు కైలాస్ నేత టిఆర్ఎస్ పార్టీ నుంచి వలస వచ్చిన వారిని వెంటబెట్టుకొని వారికి ప్రాధాన్యత ఇస్తే తాము చూస్తూ ఊరుకోమని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాబోయే స్థానిక సంస్థలఎన్నికలలో పార్టీ విజయానికి పనిచేస్తామన్నారు.

నూతన డిసిసి అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కోసం కార్యకర్తలు అంతా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్,తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Sand Transport : అక్రమ ఇసుక రవాణా.. నాలుగు లారీలు పట్టివేత..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సాహసం.. ఓ మహిళ ధరఖాస్తుకు స్పందించి చెంచువాని తండాలో పర్యటన..!

  3. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం.. టికెట్ రేట్లు ఇవీ..!

  4. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం.. టికెట్ రేట్లు ఇవీ..!

మరిన్ని వార్తలు