Breaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
రోజురోజుకు ఎంతో కొంత ధర తగ్గుతుందని బంగారం ప్రియులు సంతోషపడుతున్న వేళ.. మళ్లీ ఒకేసారి బంగారం ధర కొండెక్కింది. మంగళవారం ఒక్క రోజే 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 19,100 పెరిగింది. దాంతో మహిళలు నిరాశకు గురయ్యారు.
100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 19,100 రూపాయలు పెరిగి 12, 70, 400 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాములకు 17,500 రూపాయలు పెరిగి 11,74,500 లకు చేరింది.
ఈరోజు తులం ఎంతంటే..?
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ 1910 రూపాయలు పెరిగి 1,27,040కు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 1750 రూపాయలు పెరిగి 1,16,450 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
MOST READ :









