Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమెదక్
Medak : మెదక్ జిల్లాలో విషాదం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య..!

Medak : మెదక్ జిల్లాలో విషాదం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య..!
టేక్మాల్, మన సాక్షి :
భార్యను చంపి ఆపై భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరదిలోని బర్దిపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
మంగళవారం ఉదయానికి మంజుల హత్యకు గురికాగా భర్త శ్రీశైలం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. భార్యా భర్తల మృతితో బర్దిపూర్ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
ఈ సమాచారం తెలుసుకున్న టేక్మాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించింది. భార్యా భర్తల మరణాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ
-
District collector : ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం ఏంటి.. జిల్లా కలెక్టర్ ఆగ్రహం..!
-
PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!
-
TG NEWS : సర్పంచ్ ఎన్నికల వేళ.. మద్యం రవాణా.. తనిఖీలలో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు..!
-
Nalgonda : ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్..!









