Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

District collector : ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం ఏంటి.. జిల్లా కలెక్టర్ ఆగ్రహం..!

District collector : ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం ఏంటి.. జిల్లా కలెక్టర్ ఆగ్రహం..!

నల్లగొండ, మన సాక్షి :

ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం ఏంటని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటిండెంట్ ను ప్రశ్నించారు. అలాగే వార్డులో ఉన్న వారందరినీ వెంటనే బయటికి పంపాలని చెప్పారు. మంగళవారం ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు ,చిన్నపిల్లల వార్డు, ఐసీయూ తదితర వార్డులలో తనిఖీలు నిర్వహించారు.

కాగా ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే అందరిని బయటకు పంపించాలని, పురుషులను ప్రసూతి వార్డులోకి ఎందుకు అనుమతించారని డ్యూటీ డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఇదే విషయంపై జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరిండెంట్ పై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు సహాయకులు ఎక్కువమంది ఉండడం వల్ల చిన్న పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని ,అందువల్ల ఎక్కువ మంది ఉండకుండా, కేవలం ఒక్కరు మాత్రమే సహాయకులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం ఆసుపత్రిలోని ప్రతి వార్డులో ఉన్న సీసీ కెమెరాలు, ఆరు బయట వాహనాలు నిలిపే చోట ఇతర ముఖ్యమైన స్థలాలలో ఉన్న సీసీ కెమెరాలను ఆమె తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని, ముఖ్యంగా ప్రధాన గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలు 24 గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు.

ప్రత్యేకించి ఆటోలు నిలిపే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటిండెంట్ అరుణకుమారి, డాక్టర్ వందన, డాక్టర్ నగేష్ , తదితరులు ఉన్నారు.

MOST READ 

  1. PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!

  2. PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!

  3. TG News : రైతులకు భారీ శుభవార్త.. వారి అకౌంట్లో డబ్బులు జమ..!

  4. Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!

  5. SARPANCH : జాక్ పాట్ సర్పంచ్ మల్లమ్మ..!

మరిన్ని వార్తలు