District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. గ్రీన్ ఫీల్డ్ హైవే వేగవంతంగా పూర్తి చేయాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. గ్రీన్ ఫీల్డ్ హైవే వేగవంతంగా పూర్తి చేయాలి..!
ఖమ్మం, మన సాక్షి :
కొత్త సంవత్సరంలో ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రావాలని, రైల్వే శాఖను సమన్వయం చేసుకుంటూ ఆర్ఓబీ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
మంగళవారం ధంసలాపురం వద్ద ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఖమ్మంకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిశీలించారు. నమూనా మ్యాప్ లను చూసి ఏజెన్సీలకు సూచనలు చేశారు. నిర్మాణ దశలలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసురావాలని, పనులను వేగవంతం చేసి జనవరి కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో వేగం పెంచి ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారిపై ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, మున్నేరుపై బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలని అన్నారు.
ఖమ్మం ప్రజలకు, ప్రక్క రాష్ట్రం వారికి ఈ జాతీయ రహదారి ఉపయోగపడుతుందని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి, కాంక్రిట్ వాల్ జనవరి నాటికి పూర్తి చేయాలని, రోడ్డు నిర్మాణంలో సేఫ్టీ నియమాలు పాటించాలని కలెక్టర్ అన్నారు. ఆర్.ఓ.బి. నిర్మాణానికి సంబంధించి భూసేకరణ వంటి అన్ని పనులు పూర్తి చేశామని, ఒకవైపు రైల్వే బ్రిడ్జి పూర్తి చేసుకుంటే సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం వరకు ఉపయోగపడుతుందని తెలిపారు.
నూతన సంవత్సరంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, రైల్వే శాఖను సమన్వయం చేసుకుంటూ ఆర్ఓబీ నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. రైల్వే, కెనాల్, మున్నేరుపై రహదారి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రహదారి వాహనాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ సర్వీస్ రోడ్లు, మున్నేరు బ్రిడ్జ్ తో పాటు ధంసలాపురం ఎగ్జిట్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని, జాతీయ రహదారి పనులకు సంబంధించి పెండింగ్ భూ సేకరణ పనులు నిరంతరం మానిటరింగ్ చేస్తూ వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట నేషనల్ హైవే పిడి దివ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ
-
TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!
-
TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!
-
SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!
-
LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ కావాలా.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..!
-
Vemulapally : పంచాయతీ ఎన్నికల్లో రావులపెంటలో బిఆర్ఎస్ హవా..!









