Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking News

SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!

SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!

మన సాక్షి , మనసాక్షి :

నిరుద్యోగులకు SBI తాజాగా శుభవార్త తెలియజేసింది. కస్టమర్లకు డిజిటల్ సేవలపై అవగాహన కల్పించేందుకు కొత్తగా 6500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నది. ఈ విషయాన్ని తాజాగా యోనో – 2.0 విడుదల చేసిన కార్యక్రమంలో ఎస్బిఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలియజేశారు.

ఎస్బిఐ బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసేందుకు గాను 2026 మార్చి 31 నాటికి ఫ్లోర్ మేనేజర్ స్థాయిలో 10 వేల మందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే 3500 మందిని నూతనంగా నియమించారు. ఇదిలా ఉండగా మరో 6,500 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బ్యాంకింగ్ విస్తృత సేవలలో డిజిటల్ వ్యూహానికి అనుగుణంగా కొత్త ఉద్యోగులు, కస్టమర్లు డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు మారడానికి సహాయం చేయడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. యోనో కస్టమర్ బేస్ ను ప్రస్తుతం 9.46 కోట్ల మంది వినియోగదారుల నుండి 20 కోట్లకు రెట్టింపు చేయడమే ఎస్బిఐ లక్ష్యమని చైర్మన్ శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు.

యోనో 2.0 లో ఫీచర్స్ :

యోనో 1.0 లో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారంగా 2.0 వెర్షన్ ఎస్బిఐ ప్రారంభించింది. యూపీఐ చెల్లింపులను సులభతరంగా చేయవచ్చును. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ ఫర్, ఆటో పే ఆప్షన్స్ కూడా దీనిలో ఉంటాయి. క్రెడిట్ స్కోర్ ఉంది. iOS యూజర్లకు ఫేస్ ఐడి, ఆండ్రాయిడ్ కస్టమర్లకు బయోమెట్రిక్ సహా మల్టిపుల్ లాగిన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ యాప్ ను మొబైల్ తో పాటు టాబ్లెట్, డెస్క్ టాప్ లో కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు.

MOST READ 

  1. LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ కావాలా.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..!

  2. TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇక నో టెన్షన్..!

  3. TG News : అమెరికా నుంచి వచ్చి.. ఒక్క ఓటుతో గెలిచి..!

  4. Vemulapally : పంచాయతీ ఎన్నికల్లో రావులపెంటలో బిఆర్ఎస్ హవా..!

మరిన్ని వార్తలు