Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లావైద్యం

Yadadri : యాదాద్రి జిల్లాలో నిండు గర్భిణీ పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది..!

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరోసారి అధికారులు సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు.

Yadadri : యాదాద్రి జిల్లాలో నిండు గర్భిణీ పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది..!

తుర్కపల్లి , మన సాక్షి :

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరోసారి అధికారులు సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ గర్భిణి మహిళకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు చేరుకుంది. అయితే అక్కడ కనీసం నర్స్ కూడా వీధుల్లో లేకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది.

అత్యవసర సమయంలో వైద్య సేవలు అందాల్సిన ఆసుపత్రిలో పూర్తిగా సిబ్బంది హాజరు కావడం ఆ మహిళ తీవ్ర భయాందోళనలకు గురైంది. ప్రసూతి నొప్పులతో ఉన్న అమ్మాయిల వెంటనే చికిత్స చేయాల్సిన పరిస్థితి ఉండగా ఆస్పత్రి తలుపులు తెరిచే వారు కూడా లేకపోవడం విడ్డూరం చివరకు ఆమె కుటుంబ సభ్యులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు.

ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లినట్లే అని విమర్శలు వినబడుతున్నాయి. ఇది మొదటిసారి కాదు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కొరత నిర్లక్ష్య వైఖరి రాత్రి సమయంలో అందుబాటులో లేకపోతే సమస్యలపై ఇప్పటికే పలమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లాయి.

అయినప్పటికిని పరిస్థితి ఎలాంటి మార్పు రాకపోవడం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తుంది.ఇట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆక్రోసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రజలకు మొదటి వైద్య సేవలు అందించేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇలాంటి దారుణ పరిస్థితి నెలకొనడం ప్రజా ఆరోగ్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని శ్రామికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా గర్భిణులు అత్యవసర రోగులకు రాత్రివేళ వైద్య సేవ లేకపోతే పాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. లేకుంటే ఇలాంటి సంఘటన మరిన్ని జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వైద్యాధికారి డాక్టర్ రుచిరా రెడ్డి వివరణ :

తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనకి హాస్పిటల్ లో సిబ్బంది కొరత ఉంది. నైట్ వాచ్మెన్, లేనందువల్ల హాస్పిటల్లో సేవలందించలేకపోయాం. డిపార్ట్మెంట్ కి సిబ్బంది కావాలని కోరినా.. పంపడం లేదు. మండల కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన ఉంది. కానీ సిబ్బంది కొరత వల్ల అలా జరిగిందని మాకు ఫోన్లో సమాచారం ఇస్తే లోకల్ ఉన్న ఆయాను పంపిస్తానని ఆమె తెలిపారు.

MOST READ 

  1. Yadadri : యాదాద్రి జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు.. ఆరుగురి అరెస్ట్..!

  2. TG News : కొత్త వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఇక ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలి..!

  4. BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

మరిన్ని వార్తలు